ఏట‌వాలుగా న‌వ్వి సూటిగా బౌన్స‌ర్ వేసింది!

Update: 2022-01-21 16:30 GMT
ఏట‌వాలుగా న‌వ్వి సూటిగా గురి చూసి కొట్టింది!.. ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ? అంటే .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ హాట్ గాళ్ నిధి అగ‌ర్వాల్ గురించే ఇదంతా. అలా స్పెష‌ల్ డిజైన‌ర్ లుక్ లో అద్భుత‌మైన హావ‌భావాల‌తో కుర్రాళ్ల క‌ళ్ల‌ను త‌న‌వైపే తిప్పేసుకుంటున్న ఈ బ్యూటీ ఇలా సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది.

ఇస్మార్ట్ బ్యూటీగా ఇప్ప‌టికే యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న నిధి వ‌రుస ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతోంది. ఇక ఇటీవ‌లి కాలంలో నిధి మునుప‌టితో పోలిస్తే ఎంతో బొద్దుగా క‌నిపిస్తోంది. ఈ రూపం ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టిస్తోన్న హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కోస‌మేన‌ని భావిస్తున్నారు. ఇటీవ‌లే డెబ్యూ హీరో గ‌ల్లా అశోక్ స‌ర‌స‌న న‌టించిన `హీరో` రిజ‌ల్ట్ మిశ్ర‌మ ఫ‌లితాన్ని అందుకుంది. ఇక‌పై ప‌వ‌న్ త‌న‌కో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తాడ‌ని హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుతో పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అందుకుంటాన‌ని ఆశిస్తోంది.

వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ సూట్ త‌ర‌హా సిల్కీ దుస్తుల్లో నిధి అంద‌చందాల‌ను వ‌ర్ణించేందుకు నిజానికి క‌వి కానివాడైనా కాళిదాసు అయిపోవాల్సిందే. అంత అందంగా క‌నిపిస్తోందంటూ యూత్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మొత్తానికి చాలా కాలానికి ఈ బ్యూటీ యువ‌త‌రం అటెన్ష‌న్ ని త‌న‌వైపు తిప్పేసుకుంటోంది. ఇస్మార్ట్ శంక‌ర్ కోస్టార్ న‌భాతో పాటు పోటీప‌డ‌గ‌లుగుతోంది.
Tags:    

Similar News