ఫోటో స్టోరి: నిధి గ‌వ్వ‌ల రింగులు వెరీ స్పెష‌ల్

Update: 2021-04-23 13:30 GMT
2017లో మున్నా మైఖేల్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది నిధి అగ‌ర్వాల్. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో అక్కినేని హీరోల స‌ర‌స‌న వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంది. కానీ ఇవేవీ నిధికి పెద్ద‌గా క‌లిసి రాలేదు. ఆ త‌ర్వాత‌ ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలో న‌టించినా అది ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో క‌లిసి రాలేదు. స‌హ‌నాయిక‌ న‌భా న‌టేష్ కి ఆ క్రెడిట్ అంతా వెళ్లిపోవ‌డం నిధిని తీవ్రంగానే నిరాశ‌ప‌రిచింది. అయినా ఇంకా టాలీవుడ్ లో స‌త్తా చాటాల‌ని త‌న ప్ర‌య‌త్నాల్లో ఉంది.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌థానాయ‌కుడిగా క్రిష్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టిస్తోంది. త‌మిళంలోనూ ఓ సినిమా చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అభిమానులకు ట‌చ్ లో ఉంది. ఇంత‌కుముందే నిధి ర‌క‌ర‌కాల ఫోటోషూట్ల‌కు సంబంధించిన మాష‌ప్ వీడియోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ అయ్యింది.

తాజాగా మ‌రో హాట్ ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది. బ్లాక్ ఫ్రాకులో నిధి అందాలు బోయ్స్ కి స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. చెవుల‌కు ధ‌రించిన ఆ గవ్వ‌ల రింగులు అంతే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ను పెంచాయి. నిధి బోల్డ్ లుక్ ప్ర‌స్తుతం యువ‌త‌రం సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News