ఫోటో స్టోరి: చీర‌క‌ట్టులో నిధి నిక్షేపాలు!

Update: 2021-11-29 23:30 GMT
బెంగ‌ళూరు బ్యూటీ నిధి అగ‌ర్వాల్ కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించాక‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకుంది. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే యువ‌హీరోల స‌ర‌స‌నా నిధి అవ‌కాశం ద‌క్కించుకుంది.

ఇక నిధి సోష‌ల్ మీడియా ఫీట్స్ గురించి తెలిసిందే. ఈ బ్యూటీ  గ్లామ‌ర్ షోతో పాటు.. ట్రెడీష‌న‌ల్ లుక్ తో మెప్పించడానికి ప్ర‌య‌త్నిస్తుంది. బికీనీ..లు పోట్టినిక్క‌ర్లలో ఈ బెంగ‌ళూరు బ్యూటీ దుమారం రేపుతుంది. అయితే ఫోటోషూట్ల ప‌రంగా త‌న‌కంటూ కొన్ని హ‌ద్దులు ఉన్నాయని ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు చేసుకుంటూ వృత్తిగ‌త జీవితంలో సైతం ముందుకు సాగుతుంది. తాజాగా ఈ బ్యూటీ మ‌రోసారి చీర‌క‌ట్టుతో నెటి జ‌నుల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది. షోల్డ‌ర్ లెస్ డిజైన‌ర్ టాప్ ధ‌రించి.. మ్యాచింగ్ చీర లో ఆక‌ర్ష‌ణీయమైన లుక్ లో ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ ఫోటోలో నిధి ఎంతో బొద్దుగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. నిధి అందాల‌న్నీ చీరక‌ట్టులోనే దాచేసిందంటూ ఓ నెటిజ‌నుడి కామెంట్ ఆస‌క్తిక‌రం. ఇక నిధి సినిమాల విష‌యానికి వ‌స్తే.. `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రంతో భారీ హిట్ అందుకున్నా హాట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ టాలీవుడ్ కెరీర్ న‌త్త‌న‌డ‌క‌నే సాగుతోంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది. అదీ సూప‌ర్ స్టార్  మ‌హేష్  మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం. ఆ సినిమా డిలే అవుతోంది.స‌క్సెస్ ఉన్నా! అవ‌కాశాలు అందుకోవ‌డంలో నిధి ఇంకా ఎందుక‌నో  వెనుకబ‌డే ఉంది.

నిధి త‌ర్వాత సినీఎంట్రీ ఇచ్చిన‌ భామ‌లంతా అవ‌శాలందుకుంటూ కెరీర్ ని  ప‌రుగులు పెట్టిస్తున్నారు. కానీ నిధికి కెరీర్ ప‌రంగా హ్యాండ్ ఫుల్ ఆఫ‌ర్లు అయితే లేవు. అయితే త‌మిళ్ - క‌న్న‌డ సినిమాల్లో గ‌ట్టి ప్ర‌య‌త్నాల్లో ఉందిట‌. పూరి చొర‌వ‌తో ఇస్మార్ట్ శంక‌ర్ లో ఛాన్స్ ద‌క్కించుకున్నా పేరంతా న‌భా కొట్టేయ‌డం త‌న‌కు మైన‌స్ అయ్యింద‌నే చెప్పాలి. ఈసారి ప్ర‌ధాన లీడ్ గా మెప్పించే ఛాన్స్ ద‌క్కితే నిధికి ఫేట్ మారుతుంద‌నే భావిస్తున్నారు.
Tags:    

Similar News