బ్ల‌ర్ లోనూ హాట్ గా రెచ్చిపోయిందిగా

Update: 2022-02-18 03:30 GMT
అంద‌గ‌త్తె హొయ‌లు బ్ల‌ర్ లోనూ అంతే గ‌మ్మ‌త్తుగా మ‌త్తెక్కిస్తాయి. ఇదిగో ఇక్క‌డ నిధి అగ‌ర్వాల్ అంద‌చందాలు కుర్ర‌కారును క‌వ్విస్తున్నాయి. ఇటీవ‌ల కొంత‌కాలంగా నిధి అందాల ఆర‌బోత‌ను డ‌బుల్ డోస్ కి పెంచేసింది. అందుకు తాజా నిద‌ర్శ‌నం ఈ  ఫోటోషూట్.

బెంగుళూరు గాళ్ నిధి అగ‌ర్వాల్ ఫ్యాష‌న్ పోక‌డ‌లు యువ‌త‌రంలో నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా సింపుల్ టాప్ లో క‌నిపించిన ఈ బ్యూటీ అంతే హాట్ గా వ‌య్యారాన్ని ఒల‌క‌బోసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

నిధి న‌టించిన తాజా చిత్రం హీరో ఆశించినంత హిట్ట‌వ్వ‌లేదు. అయితే నిధి గ్లామ‌ర్ కి మాత్రం యూత్ మంత్ర‌ముగ్ధులైపోయారు. చూడ‌గానే ప్రేమ‌లో ప‌డిపోతారు! అంటూ త‌న క‌థానాయ‌కుడే మెచ్చుకున్నాడంటే అర్థం చేసుకోవాలి.

 నిధి త‌దుప‌రి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ వీర‌మ‌ల్లులో క‌నిపించ‌నుంది. ఇందులో రాకుమారిగా మైమ‌రిపించే న‌ట‌న అంద‌చందాల‌తో క‌ట్టి ప‌డేయ‌నుంద‌ని తెలిసింది.
Tags:    

Similar News