రానా సరసన కైపుకళ్ల సుందరి?

Update: 2021-04-01 01:30 GMT
ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఒక గాసిప్ గుప్పుమంటోంది .. రానా సరసన నాయికగా నిధి అగర్వాల్ చేయనుందనేది దాని సారాంశం. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తరువాత కథానాయకుడిగా రానా హిట్ అనే మాట వినలేదు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా, అంతగా ప్రాధాన్యత లేని ఆ పాత్రలు పాలిపోయాయి .. తేలిపోయాయి. హీరోగా చాలా గ్యాప్ తరువాత రానా 'అరణ్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. ఆ తరువాత ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో రానా ఉన్నాడు.

రానా కథానాయకుడిగా ఒక భారీ బడ్జెట్ సినిమాను రూపొందించడానికి ఒక సీనియర్ డైరెక్టర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. రానా బాడీ లాంగ్వేజ్ కి తగిన కథను రెడీ చేసుకుని ఇటీవలే ఆయనకి వినిపించాడని అంటున్నారు. త్వరలోనే రానా తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడని చెబుతున్నారు. ఒకవేళ రానా ఓకే అంటే మాత్రం ఆయన జోడీగా నిధి అగర్వాల్ ను తీసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని అంటున్నారు. రానా నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే నిధి అగర్వాల్ వైపు నుంచి ఎలాంటి పరిస్థితుల్లోను అభ్యంతరాలు ఉండవనే అనుకోవాలి.

నిధి అగర్వాల్ అక్కినేని యువ హీరోలతోనే తొలి రెండు సినిమాలు చేసింది. ఆ సినిమాలు అంతగా ఆడకపోవడంతో, తమిళ తెరను తన గ్లామర్ తో తడిపేయాలని అనుకుంది. అక్కడ సినిమాలు ఒప్పేసుకోగానే ఇక్కడ 'ఇస్మార్ట్ శంకర్' హిట్ కొట్టేసింది. బిరియాని పొట్లాన్ని బీచ్ లో విప్పినట్టుగా కనిపించే ఈ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్న మాస్ కుర్రాళ్లు, ఇంకా అక్కడే టెంట్లు వేసుకుని మరీ వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం ఈ పిల్ల పవన్ సరసన నాయికగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఫిల్మ్ నగర్లో నిపిస్తున్న గాసిప్ .. నిజంగా మారితే మాత్రం, రానా జోడిగా ఈ రత్నాలరాశి మెరవడం ఖాయమే అనుకోవాలి.        
Tags:    

Similar News