మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు పరిచయం అయ్యారు కాని హీరోయిన్స్ లేరు అనుకుంటున్న సమయంలో నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగబాబు ముద్దుల కూతురు అయిన నిహారిక హీరోయిన్ గా ప్రయత్నాలు అయితే చేసింది కాని కమర్షియల్ ఫలితాన్ని దక్కించుకోలేక పోయింది. మల్టీ ట్యాలెంటెడ్ అయిన నిహారిక ఒక వైపు నటిస్తూనే మరో వైపు నిర్మాణం కూడా చేసింది. పింక్ ఎలిఫాంట్ అనే బ్యానర్ లో నిహారిక పలు షార్ట్ ఫిల్మ్ లు మరియు వెబ్ సిరీస్ లు చేసింది. మొదటి సారి నిహారిక నిర్మాణంలో ఒక సినిమా రూపొందింది. సినిమా నిర్మాణం ప్రారంభం అవ్వడంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. సర్ ప్రైజ్ గా నిహారిన తన బ్యానర్ లో రూపొందిన మొదటి సినిమా విడుదల తేదీని అధికారికంగా నాగబాబు బర్త్ డే సందర్బంగా ప్రకటించింది.
తండ్రి నాగబాబుకు సర్ ప్రైజ్ ఇస్తూ నిహారిక ఈ సినిమా టైటిల్ ను మరియు ఇతర విషయాలను రివీల్ చేయడం జరిగింది. నిహారిక సినిమా నిర్మిస్తున్న విషయం నాగబాబుకు ముందు నుండి తెలియదట. పెళ్లి తర్వాత నిర్మాతగా కొనసాగే ఉద్దేశ్యంతో నిహారిక ఈ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టారట. ఈ సినిమాను థియేటర్ల ద్వారా కాకుండా ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రముఖ దివంగత దర్శకుడు శోభన్ తనయుడు.. ఈమద్య కాలంలో మంచి సక్సెస్ లు అందుకుంటున్న సంతోష్ శోభన్ తమ్ముడు అయిన సంగీత్ శోభన్ హీరోగా నటించాడు. ఇప్పటికే ఇతడు ఒకటి రెండు ప్రాజెక్ట్ లు చేసి నటుడిగా మంచి పేరును దక్కించుకున్నాడు. ఆమద్య ఒక వెబ్ సిరీస్ లో నటించి మంచి యాక్టివ్ అనిపించుకున్నాడు. సంగీత్ శోభన్ హీరోగా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే టైటిల్ తో సినిమాను నిర్మించారు.
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని జీ5 ఓటీటీ లో నేరుగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నవంబర్ 19న ఈ స్ట్రీమింగ్ మొదలు కాబోతున్నట్లుగా కూడా అధికారికంగా ప్రకటించారు. ఈమద్య కాలంలో జీ5 లో తెలుగు కంటెంట్ ఎక్కువగా వస్తుంది. ప్రముఖ ఓటీటీలకు పోటీగా అన్నట్లుగా జీ5 వరుసగా సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను తెలుగు లో స్ట్రీమింగ్ చేస్తూ ఉంది. నిహారికతో పెద్ద మొత్తంలో ఒప్పందం చేసుకుని ఈ సినిమాను జీ5 కొనుగోలు చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నటిగా చాలా ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిహారిక నిర్మాతగా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా.. లేదంటే ముందు ముందు మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి. మొత్తానికి పెళ్లి తర్వాత మొదటి ప్రాజెక్ట్ అవ్వడం వల్ల నిహారికకు ఇది ఖచ్చితంగా స్పెషల్ అనడంలో సందేహం లేదు.