హ్యాపి వెడ్డింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది కొణిదెల నిహారిక. మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె ప్రస్తుతం కెరీర్ పరంగా స్పీడ్ పెంచుతున్న సంగతి తెలిసిందే. సెలక్టివ్ గా స్క్రిప్టులు ఎంచుకుంటూ తెలివైన అడుగులు వేస్తోంది. అనవసరమైన ఎక్స్ పోజింగులతో స్టార్ హీరోయిన్ అయిపోవాలన్న ఆత్రం నిహారికలో మచ్చుకైనా చూడలేం. పద్ధతిగా తనకంటూ ఓ మార్గం ఉందని నిరూపిస్తోంది.
ఈరోజు హ్యాపి వెడ్డింగ్ ఇంటర్వ్యూలో నీహారిక ఊహించని షాకింగ్ మ్యాటర్ లీక్ చేసింది. పెళ్లి గురించి మీ అభిప్రాయమేంటి? అన్న ప్రశ్నకు పెళ్లంటే నాకు ఎంతో గౌరవం ఉందని చెప్పడమే గాకుండా ... తను చూసినంతవరకూ అంతా పెళ్లిళ్లతోనే హ్యాపీగా ఉన్నారని చెప్పింది. మా ఇంట్లో కానీ, నా స్నేహితుల్లో కానీ పెళ్లి చేసుకున్నవారంతా సంతోషంగా ఉన్నారు. సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేశారు. అందుకనే నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడిప్పుడే మంచి పాత్రల్లో ఛాన్సొస్తోంది కాబట్టి కెరీర్ పై దృష్టి పెట్టాను. ముందు నటన.. ఆపై నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకుని లైప్ లో సెటిలైపోతాను అని చెప్పింది.