ఈసారైనా నీహారిక హిట్ కొడుతుందా?

Update: 2018-07-24 06:38 GMT
మెగా డాటర్ గా ఒక మనసుతో పరిచయమైన నీహారిక సినిమాలు చేసే విషయంలో అంత దూకుడు ప్రదర్శించడం లేదనే విషయం రెండో సినిమాకు ఇంత గ్యాప్ తీసుకున్నప్పుడే అర్థమైపోయింది. దానికి తోడు గ్లామర్ రోల్స్ చేయడానికి మెగా అభిమానుల వైపు నుంచి ఉన్న అభ్యంతరం వల్ల వచ్చిన అవకాశాలు అన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. అందుకే ఆచి తూచి సినిమాలు చేస్తున్న నీహారిక కొత్త మూవీ హ్యాపీ వెడ్డింగ్ 28న విడుదల కానుంది. బజ్ కానీ హైప్ కానీ ఏమి లేకపోవడం ఒకరకంగా మైనస్ గా నిలుస్తోంది. యువి లాంటి పెద్ద సంస్థ నిర్మించినా విడుదల విషయంలో థియేటర్ల పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకపోయినా ఇవన్నీ ఓపెనింగ్స్ తీసుకొచ్చే కారణాలు కావు.

నీహారిక కోసమే మొదటి రోజు  చూసి తీరాలి అనే ప్రేక్షకులు తక్కువ. మెగా ఫాన్స్ అయినా అందరూ పొలోమని వెళ్లిపోయే పరిస్థితి లేదు. ఈ నేపధ్యంలో హ్యాపీ వెడ్డింగ్ కు టాక్ చాలా కీలకంగా మారనుంది. ఒక మనసు టైంలో ఉన్న ఆసక్తి కూడా ఇప్పుడు కనిపించకపోవడం విశేషం. నీహారికకు హ్యాపీ వెడ్డింగ్ హిట్ కావడం చాలా అవసరం. ట్రైలర్ చూస్తుంటే రెగ్యులర్ ఫామిలీ ఎంటర్ టైనర్ లా అనిపిస్తోంది. దానికి తోడు మార్కెట్ పూర్తిగా కోల్పోయిన సుమంత్ అశ్విన్ హీరో కావడం కూడా పబ్లిసిటీ పరంగా హెల్ప్ కావడం లేదు. అందుకే రామ్ చరణ్ ని గెస్ట్ గా తీసుకొచ్చి ఆడియో వేడుక చేయాల్సి వచ్చింది. చిరంజీవే వచ్చినా కంటెంట్ ఉంటే తప్ప ఏదైనా నిలవడం కష్టం. సో హ్యాపీ వెడ్డింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సవాలే ఎదురుకోవాల్సి ఉంది. ఒక మనసు డిజాస్టర్ తాలూకు ప్రభావం ఇంకా నీహారిక మీద ఉంది. ఆ మధ్య తమిళ్ లో విజయ్ సేతుపతి సరసన ఓ కామెడీ ఫాంటసీ చేస్తే అది కూడా ప్లాప్ అయ్యింది.

సో హ్యాపీ వెడ్డింగ్ తో ప్రూవ్ చేసుకుంటే తప్ప ఇప్పుడు షూటింగ్ లో ఉన్న కొత్త సినిమాకు కనీస బజ్ రాదు. కానీ నిర్మాతలు ధీమాగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి నీహారిక తనతో పాటు ఫ్యామిలీ మొత్తం కోరుకుంటున్న సక్సెస్ ని హ్యాపీ వెడ్డింగ్ తో అందుకుంటుందో లేదో చూడాలి. అసలే ఇలాంటి బ్యాక్ డ్రాప్ లోనే వస్తున్న చిలసౌతో పాటు భారీ బడ్జెట్ మూవీ సాక్ష్యంతో పోటీ ఉంది. మరి ఎంత వరకు నెగ్గుతుందో 28న తేలిపోతుంది.
Tags:    

Similar News