'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక కొణిదెల.. 'హ్యాపీ వెడ్డింగ్' 'సూర్యకాంతం' 'ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్' వంటి చిత్రాల్లో నటించింది. టీవీ రంగంలో హోస్ట్ గానూ అలరించింది. పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తూ.. పలు వెబ్ సిరీసుల్లోనూ మెరిసింది. ఈ క్రమంలో నిర్మాతగా మారి 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్ ని నిర్మించింది. జీ5 ఓటీటీలో నవంబర్ 19 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ కార్యక్రమానికి హాజరైన నిహారిక.. పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
నిహారిక మాట్లాడుతూ.. దేవిశ్రీప్రసాద్ 'ఓ నిహారికా నిహారిక' అనే పాట తన కోసమే స్వరపరిచారని అనుకుంటానని నవ్వేసింది. చిన్నప్పుడు టీచర్ అవ్వాలని అనుకున్నానని.. సెవెంత్ క్లాస్ టైం కి డాక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యానని.. బైపీసీలో ఫిజిక్స్ ఉంటుందని తెలిసి డాక్టర్ వద్దని డిసైడ్ అయ్యానని నిహారిక చెప్పుకొచ్చింది. తన తండ్రి నాగబాబు తనని 'మమ్మీ' అని పిలుస్తారని.. సోదరుడు వరుణ్ తేజ్ పరిస్థితులను బట్టి నిహా అని.. బాగా ముద్దొస్తే బంగారం.. ఇంకా బాగా ముద్దొస్తే పంది అని పిలుస్తారని నవ్వుతూ చెప్పింది.
చిన్నప్పుడు తన తండ్రి ఒకసారి కొట్టారని.. వరుణ్ తేజ్ తో విపరీతంగా పొట్లాడానని నిహారిక తెలిపింది. తనది పెద్దలు కుదిర్చిన వివాహమని.. అంతకుముందెప్పుడూ చైతన్యను చూడలేదని.. తనని చైతన్య టీవీలో చూసి ఉండొచ్చని నిహారిక సరదాగా నవ్వేసింది. చిరంజీవి - పవన్ కల్యాణ్ - నాగబాబుల్లో ఎవరంటే బాగా ఇష్టమని అడగ్గా.. తన తండ్రి అంటే ఎక్కువ ఇష్టమని.. ఆయన లేకపోతే చచ్చిపోతానని అని మెగా డాటర్ చెప్పుకొచ్చింది. తనతో పాటుగా తన తండ్రి - చిన్న మేనత్త - సాయి ధరమ్ తేజ్ లకు కాస్త మెంటల్ ఉందని చెప్పి నవ్వులు పూయించింది.
ఇకపోతే నిహారిక ప్రధాన పాత్రలో ఓ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్ రూపొందుతోంది. రాయుడు చిత్రాలు బ్యానర్ పై భాను రాయుడు దర్శక నిర్మాతగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ - యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలీ షో లో నిహారిక తోపాటుగా నిఖిల్ కూడా హాజరై అలరించారు.