రూమ‌ర్స్ కి చెక్ పెట్టిన మెగా ప్రిన్సెస్

Update: 2022-03-14 03:51 GMT
సోష‌ల్ మీడియా యుగంలో రూమ‌ర్లు చాలా సులువుగా వైర‌ల్ అయిపోతున్నాయి. ఉన్న‌వి లేనివి క‌ల్పించి ప్ర‌చారం చేసేయ‌డంతో తీవ్రంగా హ‌ర్ట్ అయిపోతున్నారు కొంద‌రు. నిజం ఏమిటో అబ‌ద్ధం ఏమిటో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్ ని సృష్టిస్తున్నారు. ఇదే తీరుగా ఇటీవ‌లి కాలంలో మెగా ప్రిన్సెస్ నిహారిక‌- చైత‌న్య దంప‌తుల పైనా ర‌క‌ర‌కాల రూమ‌ర్లు సోషల్ మీడియాల్లో వైర‌ల్ అయ్యాయి. దీంతో ఈ రూమ‌ర్ల‌కు చెక్ పెట్టాల్సిన ఆవ‌శ్య‌కత ఏర్ప‌డింది.

కొణిదెల నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను తాత్కాలికంగా మూసివేసిందనే వార్త మీడియా సర్కిల్ లలో ప్ర‌ధానంగా వైర‌ల్ అయ్యింది. తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నార‌నేది ఈ పుకారు సారాంశం. ఇది నిజ‌మా అబ‌ద్ధమా? అన్న‌దానికి స‌రైన క్లారిటీ లేదు. వాస్త‌వం ఏమిటో ఎవ‌రికీ తెలియ‌దు. ఆమె వ్యక్తిగత పోస్ట్ లు భర్త జెవి చైతన్య పోస్ట్ లు ఏమైనా ఉంటే ప్రతిదీ సాధారణమైనదిగా అనిపించినా ఇప్పటికీ ఈ పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

అయితే ఇలాంటి అవాస్త‌వాలను కొట్టి పారేసేందుకు  ఆ ఇద్ద‌రిలో ఎవ‌రూ ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌డంతో ఇవి మ‌రింత‌గా వైర‌ల్ అవుతున్నాయి. ఇంతకుముందు అక్కినేని ఇంటిపేరును తొలగించి సమంత తన ప్రొఫైల్ పేరును మార్చినప్పుడు, #ChaySam గురించిన పుకార్లన్నీ సంచ‌ల‌నాలుగా మారాయి.

ఆ తరువాత అవ‌న్నీ నిజమయ్యాయి. చాలా మంది ఇతర నటులు నటీమణుల విషయంలో కూడా అదే జరగ‌డం షాక్ కి గురి చేసింది. సెల‌బ్స్ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో దానికి ముందస్తుగా సోషల్ మీడియాలో ప్రవర్తన ఉంటుంది.

కానీ గాసిప్స్ కి చెక్ పెట్టేందుకు నిహారిక త‌న భర్త జేవీ చైతన్యతో కలిసి ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసారు. సోష‌ల్ మీడియా విషాన్ని త‌గ్గించేందుకు ఈ ప్ర‌య‌త్నం అని భావించ‌వ‌చ్చు. ఇప్పుడు క్లారిటీ ఇచ్చినందున రూమ‌ర్స్ కి చెక్ పెట్టిన‌ట్టేన‌ని భావించాలి. ఇక నిహారిక పెళ్లి త‌రవాతా నిటిస్తుంద‌ని భావించినా కానీ విరామం తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. దానిపైనా రూమ‌ర్ల‌కు చెక్ పెడుతూ నిహారిక వివ‌ర‌ణ ఇస్తారేమో చూడాలి.

న‌టిగా యాంక‌ర్ గా నిర్మాత‌గా ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం క‌లిగిన ప్ర‌తిభావ‌ని కెరీర్ ప‌రంగా వెన‌క‌బ‌డిపోవ‌డం త‌న అభిమానుల‌కు న‌చ్చదు. అందుకే త‌ను వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంది.
Tags:    

Similar News