మీట్ మిస్ సూర్యకాంతం!

Update: 2019-01-03 11:10 GMT
మెగా హీరోయిన్ నిహారిక ప్రస్తుతం 'సూర్యకాంతం' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్న ప్రణీత్ బీ. దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  రెండు వారాల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. తాజాగా 'సూర్యకాంతం' టీమ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేపట్టింది

నిహారిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్టర్ ను షేర్ చేసింది. ఈ పోస్టర్ లో "సూర్యకాంతం 'నిహారిక' ను మూవీ సెట్స్ లో కలిసేందుకు ఇది మీకో అవకాశం" అంటూ మీరు కనుక నిహారిక కు సూపర్ ఫ్యాన్ అయితే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండని తెలిపారు. 1. నిహారిక కు ఇష్టమైన ఫుడ్ ఏది? 2 . నిహారిక కు బోర్ కొట్టినప్పుడు ఏ సినిమా చూస్తుంది 3. బైటకెళ్ళినపుడు ఏం చేయాలనుకుంటుంది(అడ్వెంచర్ స్పోర్ట్.. స్విమ్మింగ్.. ఈటింగ్).  ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారికి నిహరికను కలిసే అవకాశం లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం. ఇంట్రెస్ట్ ఉంటే నిర్వాణ సినిమాస్ వారి ఇన్స్టాగ్రామ్ పేజి లో ఆన్సర్ చేయండి... రీల్ సూర్యకాంతాన్ని రియల్ గా కలవండి.
 
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయిందని.. త్వరలో రిలీజ్ డేట్ ఇతర వివరాలు ప్రకటిస్తారని సమాచారం.  మార్క్ రాబిన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.  నిర్వాణ సినిమాస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  వరుణ్ తేజ్ ఈ సినిమాకు సమర్పకుడు.






Full View

Tags:    

Similar News