టాలీవుడ్ బాలీవుడ్ స్టార్లతో రొమాంటిక్ ఎపిసోడ్ లతో కట్టి పడేస్తున్న ఈ భామ ఎవరు? అమీర్ ఖాన్.. సిద్ధార్థ్.. మహేష్.. శేష్ .. ఇప్పుడు విజయ్ దేవరకొండతోనూ బోలెడన్ని పరాచికాలాడిన ఈ బ్యూటీ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
ఈ యంగ్ పబ్లిసిస్ట్ పేరు నిహారిక NM. 24 ఏళ్ల డిజిటల్ కంటెంట్ సృష్టికర్త. 2020లో ఇన్ స్టాగ్రామ్ కమ్యూనిటీని తనదైన హాస్యంతో అలరించింది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సునామీని సృష్టించింది. క్రియేటర్స్ ఫర్ చేంజ్ గ్లోబల్ అంబాసిడర్ లలో ఒకరిగా ఎంపికైన ఏకైక సోలో క్రియేటర్ కూడా ఆమె మాత్రమే. వరుసగా రెండుసార్లు క్రియేటర్ గా పాపులరైంది. సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడానికి .. ప్రేక్షకులను నిమగ్నం చేయడానికి ప్రభావితం చేసే భామగా పాపులరైంది.
`లివింగ్ అలోన్ 101` ఇన్ స్టాగ్రామ్ లో నిహారిక ఎన్.ఎం వైరల్ అయ్యింది. కేవలం 13 రోజులలోపు 11 మిలియన్ వీక్షణలను అధిగమించింది. ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంటెంట్ సృష్టికర్తలలో ఒకరిగా మారినందున వేగంగా పాపులరైంది. వెబ్ లో గొప్పగా ఎదిగేసింది ఈ బ్యూటీ. 17 అక్టోబర్ 2020న కేవలం 100k ఫాలోవర్లతో ఉన్న ఈ భామ సరిగ్గా రెండు నెలల తర్వాత 17 డిసెంబర్ 2020న గౌరవనీయమైన 1 మిలియన్ మార్క్ ను అధిగమించింది. ప్రస్తుతం ఈ భామకు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో 2.8+ మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంకా పెరుగుతున్నారు. ఈ రకమైన రీచ్ ను కలిగి ఉన్న వినియోగదారులలో 0.32 శాతం పెరుగుదలతో వేగంగా ఎదిగేస్తున్న బ్యూటీగా పాపులరైంది. ఇటీవల వరుసగా స్టార్ హీరోలంతా నిహారిక ఎన్.ఎంతో తమ సినిమాలకు ప్రచారం హోరెత్తిస్తున్నారు. నిహారిక సెన్సిబుల్ కంటెంట్ అభిమానుల్లోకి అంతే వేగంగా దూసుకెళుతోంది. అందానికి అందం ప్రతిభ ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు లైగర్ కి కూడా తనవంతు ప్రచార సాయం అందించింది. లైగర్ విజయ్ దేవరకొండతో నీహారిక ఫన్నీ ఎపిసోడ్ బ్లాస్ట్ అయ్యింది. ఎంతో సరదాగా ట్రెండీగా ఉన్న ఈ వీడియో వైరల్ గా మారింది.
మరోవైపు బాయ్ కాట్ ట్రెండ్ ఫియర్స్..
`బాయ్ కాట్ లైగర్ మూవీ` ట్విట్టర్ లో ట్రెండింగ్ కొనసాగుతున్న క్రమంలో విజయ్ దేవరకొండ స్పందించారు. బహిష్కరణ ధోరణి ఇప్పటివరకు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా .. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ బాక్స్-ఆఫీస్ వసూళ్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. విజయ్ దేవరకొండ చిత్రం `లైగర్` పై ప్రభావం చూపుతుందా? అన్నదానిపై ఇప్పుడు అస్పష్ఠత నెలకొంది. అయితే విజయ్ ఇలాంటివి సరికాదని పరిశ్రమ ఉపాధిని కోల్పోతుందని ఇంతకుముందు వ్యాఖ్యానించారు.
చాలా ప్రేమతో కష్టపడి సినిమా తీసారు కాబట్టి ప్రజలు తనను లైగర్ ని ఇష్టపడతారని తాను నమ్ముతున్నానని కూడా చెప్పాడు. తన జీవితంలో వ్యక్తిగత పోరాటాలు.. కెరీర్ అడ్డంకుల గురించి ప్రస్థావిస్తూ.. వాటిని ఎలా అధిగమించాడు అనే దాని గురించి కూడా ఓపెనయ్యాడు.
లైగర్ తో మేము కొంత నాటకీయతని ఆశించాము...కానీ మేం పోరాడతాము. ఈ చిత్రాన్ని రూపొందించడానికి మేము మా హృదయాన్ని ఉంచాము. నేను కరెక్ట్ అని నమ్ముతున్నాను. నేను భయపడను... ఏదో సాధించిన తర్వాత ఇప్పుడు కూడా భయం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ప్రజల ప్రేమ దేవుని మద్దతు ఉంది. మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో చూద్దాం అని దేవరకొండ అన్నారు.
జీవితమే నాకు ఫైటర్‌గా ఉండటాన్ని నేర్పిందని నేను నమ్ముతున్నాను. నేను చిన్నతనంలో గౌరవం డబ్బు కోసం పోరాడవలసి వచ్చింది. తర్వాత నేను పరిశ్రమలో నా స్థానం కోసం సంపాదించడానికి కూడా పోరాడవలసి వచ్చింది. ప్రతి సినిమా నాకు కఠినమైన పోరాటం లాంటిది. నేను నా మొదటి సినిమా చేస్తున్నప్పుడు దానిని నిర్మించడానికి మాకు నిర్మాత దొరకలేదు. కాబట్టి నేను ఉచితంగా సినిమా చేసాను. నిర్మాణ ఖర్చులకు డబ్బును సేకరించవలసి వచ్చింది. నా మూడవ చిత్రం అర్జున్ రెడ్డి విడుదల సమయంలో అది థియేటర్లలోకి రాకముందే మేము నిరసనను ఎదుర్కొన్నాము. కానీ అది బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ప్రజలకు నేను తెలుసు ఎందుకంటే సినిమాలో నా నటన పని గురించి తెలుసు గనుక!! అని అన్నాడు.
స్పోర్ట్స్ డ్రామా లైగర్ ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంతోనే విజయ్ హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దీనిని జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్ .. అపూర్వ మెహతా నిర్మించారు.
Full View