టాలీవుడ్ లో గా ఫ్యామిలీ నుంచి వరుసగా యువ హీరోలు ఎంట్రీ ఇస్తున్న టైమ్ లో ఒక నటి కూడా మెగా కాంపౌండ్ నుంచి వెండితెరకు పరిచయం అయ్యింది. ఆమె ఎవరో ఇప్పటికే తెలిసే ఉంటుంది. నాగ బాబు డాటర్ నిహారిక మొదట యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల తరువాత వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకొని ఒక మనసు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది.
అయితే నటన పరంగా నిహారికకు ఆ సినిమా మంచి గుర్తింపు ఇచ్చినా కూడా కమర్షియల్ గా హిట్ అందుకోలేదు. నిహారిక హీరోయిన్ గా సెట్ అవ్వాలంటే ఇంకా కష్టపడాలి అనే కామెంట్స్ బాగానే వినిపించాయి. దీంతో మెగా డాటర్ కి ఆ సినిమా తరువాత కొన్ని ఆఫర్స్ బాగానే వచ్చినా తనకు సెట్ అయ్యే సినిమాలు దొరకడం లేదని ఎక్కువగా నో చెప్పిందట. కానీ కోలీవుడ్ లో ఒక అఫర్ రాగానే నిహారిక వెంటనే ఒకే చేసింది. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ సినిమానే ఒరు నల్ల నాళ్ పాతు సొల్రెన్. విజయ్ సేతుపతి సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ ఆ సినిమాలో నటిస్తున్నారు.
అయితే మొదట ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్ గా నిహారిక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలుగులో రావడం లేదని క్లారిటీ ఇచ్చింది. అనుకుంటే మెగా పెద్దలు ఆ సినిమాను తెలుగులో డబ్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఆ సినిమాలో ఉన్న హీరోలకు టీ టౌన్ లో అంతగా మార్కెట్ లేదు. పైగా నిహారిక కూడా ఇంకా డెవెలెప్ అవ్వాలి. ఎదో ఆశపడి రిలీజ్ చేస్తే రిజల్ట్ లో తేడా రావడమే కాకుండా కెరీర్ పై కూడా దెబ్బ పడుతుంది. సో ఆ సినిమా అక్కడ హిట్ అయితే ఇక్కడికి షిఫ్ట్ చేస్తారని సమాచారం. ఫిబ్రవరి 2న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.