ఇండస్ట్రీ బాగుండాలనే ఇలా చేశామన్న నిఖిల్.. రూమర్స్ కు చెక్ పెట్టిన అనుపమ..!
నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ''కార్తికేయ 2'' సినిమా విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన ఆగస్ట్ 12న కాకుండా.. ఒక రోజు ఆలస్యంగా అంటే ఆగస్ట్ 13న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. సినిమాల మధ్య క్లాష్ ని నివారించడానికి.. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూడటానికే తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లతో పాటు దర్శకనిర్మాతలు చందు మొండేటి - టి.జి. విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. పాండమిక్ టైమ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమాను తెరకెక్కించాం. క్రియేటివ్ టీం కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆగష్టు 13న రాబోతున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పగలను. ఇప్పటికే విడుదలైనన 'కార్తికేయ 2' కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎలా ఉన్నా.. థియేటర్ కు వచ్చి చూస్తామనే కామెంట్స్ వినబడుతున్నాయి. మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం తప్పకుండా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పగలను. ఆగస్ట్ 6న ట్రైలర్ 2 ను రిలీజ్ చేస్తున్నాము'' అని తెలిపారు.
'కార్తికేయ 2' సినిమా పలుమార్లు వాయిదా పడటానికి కారణమేంటని ప్రశ్నించగా.. 'అదొక మిస్టరీ. కోవిడ్ సమయంలో సినిమాలు వాయిదా పడటం సహజం. కానీ, మా చిత్రం ఆ తర్వాతా వాయిదా పడుతూనే వచ్చింది. అన్ని సినిమాలు ఆడాలి.. చిత్ర పరిశ్రమ బాగుండాలనే ఉద్దేశంతో వాయిదా నిర్ణయం తీసుకున్నాం. సినిమాల మధ్య క్లాష్ రాకుండా ఉండాలనున్నాం. ప్రతిసారీ మా చిత్రమే వెనక్కి వెళ్తోంది. ఈ విషయంలోనే నేను బాధపడ్డాను' అని నిఖిల్ అన్నారు.
'అర్జున్ సురవరం' వాయిదా పడుతూ వచ్చి హిట్ అయింది. ఇప్పుడు 'కార్తికేయ 2' అలానే వాయిదా పడింది. దాన్ని సెంటిమెంట్ అనుకుంటున్నారా? అని అడగ్గా.. ''ఏదైనా గండం ఉంటేనో.. ఇంకేదైనా అయితేనో చిత్రం విజయవంతమవుతుందనేది ఏ ఇండస్ట్రీలోనూ ఏ హీరోకీ జరిగి ఉండదు (నవ్వుతూ..) మీరు చెప్పారు కాబట్టి అది నిజమవుతుందేమో అని అనిపిస్తోంది'' అని నిఖిల్ బదులిచ్చారు.
నటుడిగా 15 ఏళ్ల అనుభవం ఉన్న మీ సినిమా విడుదల విషయంలో ఇలా జరిగితే కొత్తగా వచ్చే వారి పరిస్థితేంటి? అని ప్రశ్నించగా.. 'జీవితంలో మనం అనుకున్నది ఏదీ అంత తేలికగా జరగదు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉంటేనే విజయం సాధిస్తాం. సినిమా అనే కాదు ఏ ఫీల్డ్ అయినా ధైర్యంగా అడుగుపెట్టండి. విజయం వరిస్తుంది' అని చెప్పారు నిఖిల్.
పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కాబోతుంది. మీరు పాన్ ఇండియా హీరో అయిపోయాననుకుంటున్నారా? అని అడిగిన దానికి నిఖిల్ స్పందిస్తూ.. గతంలోనే దీని గురించి చెప్పా. ఈ సినిమాలో హీరో నేను కాదు. మా కథే హీరో. ఇలాంటి మంచి సబ్జెక్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే వివిధ భాషల్లో విడుదల చేస్తున్నాం. అంతే తప్ప.. నేను పాన్ ఇండియా స్టార్ కావాలని మాత్రం కాదు. దీన్ని మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ అని మేం భావిస్తున్నాం అని చెప్పారు.
''కృష్ణుడు గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సినిమా తీస్తే గ్రాండ్ గా ఉండాలి. అన్నమయ్య - దేవుళ్ళు వంటి సినిమాలకు ఫ్యామిలీ మొత్తం థియేటర్ కు వచ్చి చూసేవారు. ఇప్పుడు ఎవరూ అలా రావడం లేదని.. మళ్లీ అప్పటిలా థియేటర్ కి జనాలను రప్పించాలనే మంచి భక్తితో పాటు అడ్వెంచర్ - థ్రిల్ ఉండాలని ఈ సినిమా తీయడం జరిగింది. థియేటర్ లో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు'' అని నిఖిల్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఈ మధ్య అంతా 'కార్తికేయ 2' సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే హీరో నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో అనుపమ గురించి మాట్లాడుతూ.. సెట్స్ లో తను బాగానే ఉంటుందని.. ఆ తర్వాత ఫోన్ చేస్తే ఆన్సర్ చేయదని.. అందుబాటులో ఉండదని అన్నారు. ఆమె ప్రమోషన్లకు ఎందుకు రావట్లేదో తెలియట్లేదని వ్యాఖ్యానించడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.
నిఖిల్ తో అనుపమకు ఏమైనా గొడవ జరిగిందా? అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉందా? అనే కామెంట్స్ వినిపించారు. ఇప్పటికే అనుపమ ఈ విషయమై క్లారిటీ కూడా ఇచ్చింది. వేరే సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నానని.. 'కార్తికేయ-2' రిలీజ్ డేట్ మళ్లీ మళ్లీ మారడంతో ప్రమోషనల్ షెడ్యూల్ కూడా మారిన తరుణంలో తాను అందుబాటులో లేకుండా పోయానని వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రెస్ మీట్ కు నిఖిల్ తో పాటుగా హాజరై అన్ని ఊహాగానాలకు తెరదించేసింది అనుపమ.
కాగా, నిఖిల్ - చందు మొండేటి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్ గా 'కార్తికేయ 2' తెరకెక్కింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫైనల్ గా ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.