తేజ ఫుల్ ఫాంలో ఉండగా.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిజం తీశాడు. స్టార్ హీరోతో తేజ డైరెక్ట్ చేసిన ఒకే ఒక మూవీ ఇది. దీనికి ముందు వచ్చిన పెద్ద సినిమాలను తేజ పట్టించుకోలేదు. నిజం ఫ్లాప్ తర్వాత... ఈయనో డైరెక్టర్ అని మిగతా హీరోలు పట్టించుకోలేదు. ఇన్నేళ్లకు తేజకు జ్ఞానోదయం అయిందట. ఓ విషయాన్ని తెలుసుకున్నాడు. నిజం ఫ్లాప్ అవడానికి మహేష్ బాబే కారణం అంటున్నాడు. దీనికో లెంగ్తీ ఎక్స్ ప్లనేషన్ కూడా ఇచ్చాడు లెండి.
బాబీ ఫ్లాప్ తర్వాత ఇది మొదలుపెట్టారట. సూపర్ స్టార్ ని కొత్త కోణంలో చూట్టానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారనే ఉద్దేశ్యంతో.. ఈ స్టోరీ సెట్ చేసుకున్నాడట తేజ. అయితే మధ్యలో ఒక్కడు రిలీజైపోయి.. మహేష్ ని సూపర్ స్టార్ - మాస్ హీరో చేసేసిందంటాడీ డైరెక్టర్. ఆ తర్వాత వచ్చిన నిజంలో తల్లి నేర్పితే ఫైటింగులు, పగ తీర్చుకోవడాలు లాంటి సీన్లను జనాలు జీర్ణించుకోలేకపోయారంటాడు తేజ. ఈయన చెబ్తుంటే కరెక్టేనేమో అనిపిస్తుంది కానీ.. నిజం చిత్రానికి మహేష్ కి నంది అవార్డ్ దక్కింది. ఈ మూవీలో అసలు ఆకట్టుకున్న పార్ట్ ఏదైనా ఉందంటే.. అది సూపర్ స్టార్ మహేషే. ఇక మిగిలిన కథ మామూలు రివెంజ్ డ్రామానే. ఆ సీన్స్ ను కొత్తగా చూపించుంటే.. సినిమా ఎక్కేది. అందుకే కేవలం మహేష్ కే కాసిన్ని ప్రశంసలు కూడా దక్కి.. కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది సినిమా. ఇవన్నీ మర్చిపోయిట్లున్నాడు తేజ.
ఇప్పటికే గ్రామాలను దత్తత తీసుకోవడం విషయంలో... ట్యాక్సులు ఎగ్గొట్టడానికంటూ సూపర్ స్టార్ మహేషే ఫ్యాన్స్ అగ్రహానికి గురయ్యాడు తేజ. ఇఫ్పుడు తను తీసిన నిజం ఫెయిల్యూర్ కి కారణాన్ని కూడా సూపర్ స్టార్ మీదకు నెట్టేస్తున్నాడు. తప్పును ఒప్పుకున్నవాడు దార్లో పడతాడు కానీ... కారణాలు వెతుక్కునేవాడు ఎలా డైరెక్టర్ అవుతాడు. తేజ ఏదో లింక్ మిస్సయినట్లున్నాడు కదూ.