పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. ఒక్క సినిమాతోనే కెరీర్ మొత్తాన్ని మార్చేయగల కేపబిలిటీ ఉన్న పవర్ స్టార్ కు ఉంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ శృతి హాసన్. ఐరన్ లెగ్ అనే స్టాంప్ నుంచి టాప్ స్టార్ ను చేసేశాడు.
కానీ ఓ హీరోయిన్ మాత్రం పవన్ సినిమా కారణంగా తన కెరీర్ నాశనం అయిందని అంటోంది. కొమరం పులిలో నటించిన నికీషా పటేల్.. ఈ భారీ డైలాగ్ పేల్చింది. 'నిజానికి నేను వేరే భాషల్లో సినిమాలు చేయాలని అనుకోలేదు. చిన్నదైనా సరే బాలీవుడ్ లోనే ప్రయత్నిద్దాం అనుకున్నా. కానీ దర్శకుడు ఎస్ జే సూర్య నన్ను ఒత్తిడి చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పక్కన అనే సరికి నేను కూడా మెత్తబడ్డాను. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో.. నాకు ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర వేసేశారు. అవకాశాలు కరువైపోయాయి' అని చెప్పింది నికీషా పటేల్.
రీసెంట్ గా రిలీజ్ అయిన అరకు రోడ్ లో అనే మూవీలో నటించింది కానీ.. అదేమీ ఆమె కెరీర్ కు ఉపయోగపడేది కాదు. స్టార్ హీరోలతో నటించి టాప్ రేంజ్ కి ఎదగడంలో శృతి.. సమంతలను ఎగ్జాంపుల్స్ అయితే.. కెరీర్ పాడు చేసుకున్న వాళ్లుగా నికీషా పటేల్-కృతి సనోన్ ల పేర్లు చెప్పుకోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/