ఇండస్ట్రీ సెంటిమెంట్ లకు పెద్ద పీట వేస్తూ వుంటుంది. ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి కొబ్బరి కాయ కొట్టే వరకు.. ఆ తరువాత గుమ్మడికాయ ముహూర్తం. పక్కా సెంటిమెంట్ రిలీజ్ డేట్ చూసుకుని మరీ సినిమాలని థియేటర్లలోకి వదులుతుంటారు. ప్రాజెక్ట్ సెట్టయ్యే దగ్గరి నుంచి థియేటర్లలోకి వచ్చే వరకు ప్రతీ విషయంలోనూ ముహూర్తాలు, సెంటిమెంట్ లు తూచా తప్పకుండా ఫాలో అవుతూ వుంటారు. అయితే ఇక్కడి విచిత్రం ఏంటంటే నిఖిల్ సెంటిమెంట్ ని ఫాలో అవడం కాకుండా తన సినిమాలని ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది.
తను నటించిన సినిమాలు రిలీజ్ పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటె అంత బాగా హిట్టవుతూ వచ్చాయి. ఇది విచిత్రంగా అనిపించినా పచ్చి నిజంజ. 2014లో నిఖిల్ నటించిన `కార్తికేయ` మూవీ అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని చివరికి మల్కాపురం శివకుమార్ ద్వారా థియేటర్లలోకి వచ్చింది. నిఖిల్ కెరీర్ లో మర్చిపోలేని విజయంగా నిలిచింది. సినిమా రిలీజ్ అవుతుందా? కాదా అని టెన్షన్ పడిన తనకు హీరోగా తిరుగులేని విజయాన్ని అందించింది.
ఇక ఆ తరువాత నిఖిల్ నటించిన మరో సినిమాని కూడా ఇదే సెంటిమెంట్ వెంటాడింది. 2016లో నిఖిల్ నటించిన మూవీ `ఎక్కడికి పోతావు చిన్నవాడ`. సూపర్ నేచురల్ రొమాంటిక్ థ్రిల్లర్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీని విఐ ఆనంద్ తెరకెక్కించాడు. ప్రేమించిన వాడిని వెతుక్కుంటూ వచ్చే ఓ ఆత్మ కథ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ మూవీని రూపొందించారు. నోట్ల రద్దు సమయంలో విడుదలకు సిద్ధమైన ఈ మూవీ అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది.
ఊహించని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుని నిర్మాతకు లాభాల పంటపండించింది. ఇక 2019లో విడుదలైన `అర్జున్ సురవరం` కూడా దాదాపు ఇదే తరహా రిలీజ్ సమస్యల్ని ఎదుర్కొంది. ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందా?.. కెరీర్ ఏమౌతుందో అని హీరో నిఖిల్ చాలా టెన్షన్ కు గురయ్యాడు. ఫనల్ గా అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఎట్టకేలకు నవంబర్ 29న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ అనిపించుకుంది.
తాజాగా ఇదే తరహా సెంటిమెంట్ `కార్తీకేయ 2`ని వెంటాడుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2014 లో విడుదలైన `కార్తికేయ`తో మొదలైన ఈ సెంటిమెంట్ నిఖిల్ సినిమాలని ఇప్పటికీ వెంటాడుతూ సూపర్ హిట్ లని అందిస్తుండటం విశేషం. నిఖిల్ నటించిన `కార్తికేయ 2` రిలీజ్ డేట్ సమస్యల్ని ఎదుర్కొంటోంది. జూలై 22 న రిలీజ్ అనుకుంటే ఆ డేట్ ని మార్చమని ఫోర్స్ చేశారు. అక్కడి నుంచి ఆగస్టు 12కు మార్చినా అది కూడా వద్దన్నారు.
ఫైనల్ గా ఆగస్టు 13న రిలీజ్ డేట్ ఫైనల్ అయింది. పాన్ ఇండియా వైడ్ గా విడుదలకు రెడీ అవుతున్న `కార్తికేయ 2` కూడా నిఖిల్ సెంటిమెంట్ ప్రకారం సూపర్ హిట్ గా నిలుస్తుందో అతని కెరీర్ లో బ్లాక్ బస్టర్ ని అందిస్తుందో తెలియాలంటే ఆగస్టు 13 వరకు వేచి చూడాల్సిందే.