యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ తాజాగా 18 పేజెస్ సినిమా తో సక్సెస్ దక్కించుకున్న విషయం తెల్సిందే. హీరోగా ఈయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు కార్తికేయ 3 సినిమా కూడా జాబితాలో ఉందట.
ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నా కూడా ఎక్కువ శాతం అభిమానులు మరియు ప్రేక్షకులు కార్తికేయ 3 సినిమా గురించి ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆ విషయమై నిఖిల్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ట్విట్టర్ లో ఒక అభిమాని.. అన్న కార్తికేయ 3 ఉంటుందా అంటూ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా నిఖిల్ తప్పకుండా ఉంటుంది అన్నట్లుగా ట్వీట్ చేశాడు.
ఈ సారి మూడవ పార్ట్ లో అగ్నీ అన్నట్లుగా ఫైర్ ఈమెజీని షేర్ చేయడం జరిగింది. ఒక అద్భుతమైన పాయింట్ ను దర్శకుడు ఇప్పటికే చెప్పాడని నిఖిల్ పేర్కొన్నాడు.
కార్తికేయ 2 సినిమా తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా భారీ గా వసూళ్లు సొంతం చేసుకుంది. ముఖ్యంగా హిందీలో కార్తికేయ 2 సినిమా మంచి వసూళ్లు నమోదు చేసింది.
కాస్త శ్రద్ద పెట్టి కార్తికేయ 3 సినిమాను తీస్తే హిందీలోనే వంద కోట్ల వసూళ్లను రాబట్టుకోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఆ దిశగా దర్శకుడు చందు మొండేటి ప్లాన్ చేస్తే బాగుంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.