నిఖిల్ హీరోయిన్ అస్స‌లు ఎక్క‌డా త‌గ్గ‌దుగా!

Update: 2021-04-13 15:30 GMT
`సూర్య వర్సెస్ సూర్య` చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న న‌టించిన త్రిథా చౌద‌రి ఆ త‌ర్వాత టాలీవుడ్ లో వ‌రుస‌గా సినిమాల్లో న‌టించింది. ‌ `మనసుకు నచ్చింది` అనే చిత్రంలో న‌టించాక‌.. ఇటీవ‌ల ప‌లు గ్లామ‌ర‌స్ రోల్స్ తో ఆక‌ట్టుకుంది. స్పాట్ లైట్ అనే వెబ్ సిరీస్ తో త్రిధా పేరు ఇటీవ‌ల మార్మోగింది. ఈ సిరీస్ ఆద్యంతం వేడెక్కించే లిప్ లాక్ ల‌తో త్రిధా హీటెక్కించింది.

అలాగే బాలీవుడ్ లో ఈ బ్యూటీ షంషేరా అనే భారీ చిత్రంలోనూ ఆఫ‌ర్ అందుకుంది. ఇదే హుషారులో ప్ర‌స్తుతం టాలీవుడ్ లో భారీ కంబ్యాక్ ఆఫ‌ర్ కోసం వేచి చూస్తోంద‌ట‌. ప‌నిలో ప‌నిగా ఇన్ స్టా వేదిక‌గా వ‌రుస ఫోటోషూట్ల‌తో ఆక‌ర్షిస్తోంది. ఇటీవ‌ల‌ సోషల్ మీడియాల్లో బికినీ ఫోటోషూట్స్ తో చెల‌రేగుతోంది. త్రిధా తాజా ఫోటో అంతే వైర‌ల్ గా మారింది. బీచ్ వెకేష‌న్ లో ఉన్న త్రిధా ఫ్లోర‌ల్ బికినీ యువ‌త‌రంలోకి  దూసుకెళుతోంది.

ఇంత‌కుముందు కూడా ఇదే త‌ర‌హాలో త్రిథా బికినీల‌తో ర‌చ్చ చేసింది. దానికి కొన‌సాగింపు సిరీస్ ఇది అనుకోవ‌చ్చు. ఈ స్పీడ్ చూస్తుంటే టాలీవుడ్ లో మ‌రోమారు త్రిథాకి అవ‌కాశాలిచ్చేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న వెంట‌ప‌డ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.
Tags:    

Similar News