365 దీపాలు వెలిగించిన యంగ్‌ హీరో

Update: 2020-11-30 11:30 GMT
యంగ్‌ హీరో నిఖిల్‌ సికింద్రాబాద్‌ స్కందగిరిలోని కార్తికేయ స్వామి వారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా 365 దీపాలను వెలిగించాడు. కుటుంబ సభ్యులతో దేవాలయంకు వెళ్లిన నిఖిల్‌ అందరితో పాటు దేవాలయంలో దీపాలను వెలిగించారు. ప్రతి ఏడాది కూడా తాను ఇలా దీపాలను వెలిగిస్తానంటూ చెప్పుకొచ్చాడు. కార్తీక మాసంలో ఏదో ఒక రోజున కార్తికేయ స్వామికి దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుందని నిఖిల్‌ పేర్కొన్నాడు. భారీగా జనాలు ఉన్నా కూడా నిఖిల్‌ వెళ్లి దీపాలను వెలిగించి వచ్చాడు.

ప్రస్తుతం నిఖిల్‌ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టి కార్తికేయ సినిమాపై ఉంది. గతంలో ఈ సినిమా సక్సెస్‌ దక్కించుకుంది. కనుక సీక్వెల్‌ పై సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే దర్శకుడు చాలా నమ్మకంగా చెబుతున్నాడు. కార్తికేయ సీక్వెల్‌ వచ్చే ఏడాది సమ్మర్‌ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. మరో వైపు ఈయన ఇంకా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో వాటిని పట్టాలెక్కించే అవకాశం ఉంది.
Tags:    

Similar News