మహమ్మారీ వల్ల దాదాపు రెండు నెలల పాటు ప్రపంచం లాక్ డౌన్ లో ఉంది. దీనివల్ల ఫ్యాక్టరీలు మూత పడి వాతావరణంలో ఆక్సిజన్ పెరిగింది. ఇప్పటికే ఓజోన్ పొరకు చిల్లు పడి కాలుష్యంతో ప్రమాదకర స్థితిలో మానవాళి జీవిస్తోంది. అందుకే ఇటీవలి కాలంలో ఈ బైక్.. ఈ సైకిల్ వాడకం అన్న కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. దీనివల్ల ప్రమాదకర వాయు కాలుష్యం ఉండదు. అందుకే వీటిని వినియోగించేందుకు అవేర్ నెస్ పెంచుతున్నారు. మునుముందు ఎలక్ట్రిక్ కార్ లు భారతదేశంలో తయారు కానున్నాయి. ఇప్పటికే ఫ్యాక్టరీలు మొదలయ్యాయి.
ఈ తరహా ఇన్నోవేటివ్ మ్యాటర్స్ ని వెంటనే క్యాచ్ చేసేందుకు ఆసక్తిగా ఉంటాడు యంగ్ హీరో నిఖిల్. ప్రకృతి ప్రేమికుడిగా అతడిలోని మరో ఆసక్తికర కోణం తాజాగా బయటపడింది. గాలి కాలుష్యానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వని ఎవ్వర్ లేటెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ ని సొంతం చేసుకోవడమే గాక ఆ సైకిల్ పై ఇదిగో ఇలా ఫోజిచ్చాడు. అసలే కండలు పెంచి కండరగండడిగా మారాడు. ఆ సైకిల్ పై ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇ- సైకిల్ ని ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 30 కెఎం స్పీడ్ తో 80 కిలోమీటర్ల వరకూ ఆగకుండా వెళుతుందట.
``భూమిపై వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ ప్రయత్నం... త్వరలోనే ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి రివ్యూ వీడియోని పోస్ట్ చేస్తాన``ని నిఖిల్ వెల్లడించాడు. మంచి ప్రయత్నమే. అయితే ఇ - సైకిల్ కంపెనీ ప్రచారకర్తగా నిఖిల్ డీల్ విలువ ఎంతో చెప్పలేదింకా. కెరీర్ సంగతి చూస్తే.. కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2లో నటిస్తున్న నిఖిల్ .. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 18 పేజెస్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ట్రబుల్స్ అనంతరం .. సాధ్యమైనంత త్వరలోనే వీటి చిత్రీకరణలకు సన్నాహాలు చేస్తున్నారు.