కుండ బద్దలు కొట్టిన యంగ్ హీరో

Update: 2018-03-27 04:22 GMT
కిరాక్ పార్టీతో ఓకే అనిపించుకున్న హీరో నిఖిల్ సోషల్ ఇష్యూస్ మీద కూడా తనదైన రీతిలో స్పందిస్తున్నాడు. ప్రత్యేక హోదా విషయంలో సినిమా తారలు ఎందుకు స్పందించలేదు అని దాని గురించి కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. "ఏదైనా సమస్య గురించి సినిమావాళ్ళు మాట్లాడితే ఎందుకు అనవసరంగా కలగచేసుకుంటున్నారు అంటారు. పోనీ గమ్మున ఉందామా అంటే మీకేం బాధ్యత లేదా అంటారు.ఇక్కడున్న ప్రతిఒక్కరికి సామాజిక బాద్యత ఉంది. దాన్ని అదే పనిగా బయట పెట్టుకోరు. సరైన సమయం వచ్చినప్పుడు పరిశ్రమలో అందరు ముందుకు వస్తారు. ఏదైనా ఉద్యమం లాంటిది వస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. పబ్లిక్ లైఫ్ లో స్వేచ్చగా తిరగలేని సినిమా తారలు కనక బయటికి వస్తే పరిష్కారాల కన్నా సమస్యలు ఎక్కువవుతాయి. అందుకే ఇలాంటి వాటి పట్ల సున్నితంగా ఉంటాం. కేంద్రం నిర్ణయం ఫైనల్ గా బయటికి వచ్చినప్పుడు ఆక్సిజన్ లాంటి ప్రత్యేక హోదా కోసం అందరం పోరాడాల్సిన అవసరం అయితే ఉంది"

తన ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్ అయినప్పటికీ రాజకీయ పరంగా జగన్ మోహన్ రెడ్డిని ఇష్టపడతానన్న నిఖిల్ రెండు మూడు రోజులు కిరాక్ పార్టీ సక్సెస్ టూర్ కోసం థియేటర్లకు వెళ్తేనే అలిసిపోయినట్టు అనిపించిందని అలాంటిది అన్నేసి వేల కిలోమీటర్లు వందలాది గ్రామాలను ఇలా ఎండలో నడుచుకుంటూ ప్రజా సమస్యల కోసం తిరుగుతున్న జగన్ పార్టీ నిజమైన హీరో పార్టీ అని చెప్పాడు. తన అంకుల్ ఎంఎం కోటయ్య వైఎస్ఆర్ పార్టీ తరఫున చీరాల బరిలో నిలిచే ప్రయత్నం గురించి మాట్లాడుతూ ఆయనంటే చాలా గౌరవమని అలా అని చెప్పి ఆ కోణంలో జగన్ గురించి చెప్పలేదని క్లారిటీ ఇచ్చాడు. ప్రజలకు ఎవరికి ఓటు వేయాలో బాగా తెలుసని ఎవరిని పాలకులుగా ఎంచుకోవాలో సరైన టైం వచ్చినప్పుడు వాళ్ళే చెబుతారని నిఖిల్ తమ మనసులో మాటలు షేర్ చేసుకున్నాడు.

తనకు మాత్రం రాజకీయాల పట్ల ఆసక్తి లేదని ఒక బాద్యత కలిగిన యువకుడిగా సమస్యల గురించి హక్కుల గురించి స్పందించి భాగం పంచుకునే అవకాశం ఉంటె వదిలిపెట్టనని చెబుతూ పవన్ ఖుషి సినిమా లెక్కలేనన్ని సార్లు చూసాకే హీరో కావాలన్న కోరిక కలిగిందని చెప్పాడు. జనసేన గురించి ఇప్పుడే కామెంట్ చేయటం పొరపాటు అవుతుందని పవన్ ఏం చేస్తాడో నిశితంగా గమనించి అప్పుడు స్పందిస్తానన్నాడు నిఖిల్. 
Tags:    

Similar News