యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుత సినిమా ఏంటీ అంటే ఠక్కున 'ముద్ర' అంటూ చెప్పేస్తారు. గత సంవత్సర కాలంగా నిఖిల్ సినిమా పేరు ముద్ర అంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యంగా సాగుతోంది. సినిమా విడుదలను ప్రస్తుతం మార్చిలో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి టైటిల్ గా 'ముద్ర' ను అనుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పారు. అయితే ముద్ర టైటిల్ ను అప్పటికే వేరే నిర్మాతలు రిజిస్ట్రర్ చేసుకున్నారు.
సదరు నిర్మాతలతో చర్చలు జరిపి 'ముద్ర'ను తీసుకోవాలని నిఖిల్ అండ్ టీం భావించారు. కాని అనూహ్యంగా 'ముద్ర' టైటిల్ ను ఆ నిర్మాతలు ఇచ్చేందుకు సవాలక్ష కండీషన్స్ పెట్టడంతో ఇక లాభం లేదనుకుని మరో టైటిల్ ను వెదికే పనిలో పడ్డారు. ముద్ర అనే టైటిల్ కు ముందు ఈ చిత్రానికి 'అర్జున్ సురవరం' అనే టైటిల్ ను అనుకున్నారు. అయితే అర్జున్ రెడ్డి వచ్చిన కారణంగా ఆ టైటిల్ బాగోదని భావించి ముద్రను పెట్టారు. ముద్ర టైటిల్ ఇప్పుడు దొరకని కారణంగా మళ్లీ ఆ టైటిల్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
'అర్జున్ సురవరం' టైటిల్ పై అభిప్రాయ సేకరణతో పాటు - సినిమాకు ఎవరైనా టైటిల్ ను సజస్ట్ చేయవచ్చు అంటూ సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ప్రేక్షకుల నుండి వచ్చిన అభిప్రాయం ప్రకారం అతి త్వరలోనే టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. టీ ఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. మార్చి చివర్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిఖిల్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు.
Full View