ఎంత లేట్ అయినా.. అంతే హాట్

Update: 2016-02-22 22:30 GMT
హాయ్ అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నికిత.. తర్వాత బాగానే సినిమాలు చేసింది. టాలీవుడ్ లో డజన్ సినిమాలు చేసేసిన తర్వాత.. సౌత్ అంతా పాగా వేసేందుకు బాగానే ట్రై చేసింది నికిత. బాలీవుడ్ లో కూడా ఒకటీ అరా సినిమాలు చేసినా, మలయాళంలో మాత్రం బాగా సెట్ అయిపోయింది. ఇప్పటికీ అక్కడ స్టార్  హీరోలతో జత కట్టే రేంజ్ లోనే ఉంది ఈ భామ.

రీసెంట్ గా నికిత మళ్లీ హైద్రాబాద్ వచ్చేసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అది కూడా రెడ్ డ్రస్ లో హాట్ హాట్ గా వయ్యారాలు ఒలకబోసేసరికి చాలామందికి మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పటికి 15 ఏళ్లు గడిచిపోతున్నాయి మరి. ఇంత కాలం తర్వాత కూడా ఇంకా హీరోయిన్ గా కంటిన్యూ అవటం, ఎక్స్ పోజింగ్ లకు ఏ మాత్రం వెరవకపోవడం ఆశ్చర్యకరమే. ఇంతకీ ఈ సుందరి హైద్రాబాద్ ఎందుకొచ్చిందంటే.. సీనియర్ హీరో శ్రీకాంత్ తో కలిసి నికిత నటించిన టెర్రర్ మూవీ రిలీజ్ సందర్భంగా.. ఇలా తెలుగు ప్రజలపై దయ చూపిందన్న మాట.

మరి చాలా రోజుల తర్వాత వచ్చింది కదా.. అందుకే ఫోటోగ్రాఫర్లకు తన ఘాటు వయ్యారాలను బాగా ప్రదర్శించింది. తెలుగు తెరపై చాలా కాలానికి, ఫుల్ ప్లెడ్జెట్ రోల్ చేసింది. గతేడాది అవును2లో కనిపించినా అది చిన్న పాత్రే. అంతకుముందెప్పుడో చింతకాయల రవి తర్వాత మళ్లీ అమ్మడిని కాస్త ఎక్కువ సేపు చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడే వచ్చింది.
Tags:    

Similar News