మోటివేష‌నల్ స్పీక‌ర్ మోటివేషన్ చూశారా!

Update: 2021-04-15 01:30 GMT
ఆమె బెస్ట్ మోటివేష‌న్ స్పీక‌ర్. వ్య‌క్తిత్వ వికాస నిపుణురాలు. ఆ విష‌యంలో అవార్డులు రివార్డులు అందుకుంది. ఇటీవ‌ల మోడ‌ల్ గా రాణిస్తోంది. క‌థానాయిక‌గా ట్రై చేస్తోంది. ఇక ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే. అంత‌గా త‌న‌కు ఫాలోయింగ్ ద‌క్కింది అంటే..దానికి వెన‌క కార‌ణ‌మేమిటో విడిగా చెప్పాలా?

ఇదిగో ఇక్క‌డ ఈ సిత్రం చూస్తే మీరే చెబుతారు.. ఆ విచిత్రం ఏమిటో! ఇంత‌కీ  ఈ భామ పేరేమి? అంటే.. నిఖిత శ‌ర్మ‌. ఇన్ స్టాల‌కు ట‌చ్ లో ఉండేవారికి బాగా ద‌గ్గ‌రైన భామ‌. నిరంత‌రం వేడెక్కించే ఫోటోలు వీడియోల‌తో మోటివేట్ చేయ‌డం త‌న స్టైల్.

తాజాగా టూపీస్ లో ప్ర‌త్య‌క్ష‌మై అదిరిపోయే మోటివేష‌న‌ల్ క్లాస్ చెప్పింది. ఇలా పింక్ టూపీస్ లో క‌నిపించిన ఈ బ్యూటీ ``వై డోంట్ యు క‌వ‌ర్ అప్? అని ఎవ‌రైనా అడిగితే.. `థాంక్స్ ఫ‌ర్ ది రిమైండర్` అని ఒంటిపైన ఉన్న ఆ రెండు పేలిక‌ల‌కు జ‌త‌గా మ‌రో పేలిక‌ను చేర్చింది. అదే ముక్కుకు మాస్క్ అన్న‌మాట‌. అది కూడా పింక్ లో ఉంటే బావుండ‌ద‌ని వైట్ మాస్క్ ని ధ‌రించింది. దీనికి ఒక కొంటె అభిమాని ఏమ‌ని స్పందించారు? అంటే.. ``ఇట్స్ టోట‌ల్లీ యువ‌ర్ ఛాయిస్ వాట్ యు వేర్..`` అని అన్నారు. ఎవ‌రు ఏం తొడుక్కున్నా తొడుక్కోకున్నా అది వారి ఛాయిస్ అని ఎంత బాగా చెప్పారో క‌దా!! అంత ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ అమ్మ‌డి టూపీస్ ఫోటోని అంత‌ర్జాలంలో వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి మ‌రిన్ని మంచి మోటివేష‌న్ క్లాసులు కావాల‌ని వెంట‌ప‌డుతున్నారు. ఇంత‌కుముందు ఈ భామ త‌న తాత‌య్య నాయ‌న‌మ్మ‌ల‌ను స‌ర్ ప్రైజ్ చేసేందుకు వెళ్లిన వీడియోని షేర్ చేయ‌గా వై‌ర‌ల్ అయ్యింది.
Tags:    

Similar News