దేశంలో కరోనా ప్రభావం రోజురోజుకి ప్రమాదకరంగా విస్తరిస్తూ వస్తుంది. ఇన్ని నెలల నుండి కరోనాకు మందు లేకపోవడంతో ప్రజలు, సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. అయితే ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. స్టార్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, డైరెక్టర్ రాజమౌళి ఇలా పలువురు ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా మరో సెలబ్రిటీ కరోనా బారిన పడింది. సౌత్ హీరోయిన్ నిక్కీ గల్రానీ కరోనా బారిన పడినట్లు తానే స్వయంగా ట్విట్టర్ వేదికగా బయట పెట్టింది. ఆమె తన పోస్ట్ ద్వారా ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది.. "నాకు గత వారం కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. తప్పకుండా కోలుకుంటాను. నా ఆరోగ్యం కుదుటపడటం కోసం ప్రార్థిస్తున్న వారికి, నాకు వైద్యం అందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అయితే కరోనా గురించి ప్రచారంలో ఉన్నవాటిని పక్కనపెడితే నా అనుభవాన్ని తెలియజేస్తున్నా.." అంటూ తనకు ఏర్పడిన కరోనా లక్షణాలు చెప్పుకొచ్చింది నిక్కీ. 'నాకు గొంతు నొప్పి, జ్వరం, వాసన, రుచి కోల్పోవడం వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపించాయి.
ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్నాను. అయితే ఇంట్లోనే క్వారంటైన్ లో సురక్షితంగా ఉండటం అదృష్టంగా అనిపిస్తుంది. ఇది కష్టకాలం అని తెలుసు. కానీ ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటూ, ఎదుటివారి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం మరింత అవసరం' అంటోంది భామ. అంతేగాక.. "నా ఏజ్, హెల్త్ కండిషన్ పరంగా నేను కరోనా నుంచి బయటపడతాననే నమ్మకం ఉంది. కానీ నా తల్లిదండ్రులు.. పెద్దలు.. స్నేహితులకు వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కాబట్టి దయచేసి మాస్కులు ధరించండి. మనిషి మనిషికి మధ్య సామాజిక దూరం పాటించండి. ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా కడుక్కోండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. అస్తమానం ఇంట్లోనే ఉండాలంటే చిరాకు వేస్తుందని తెలుసు. కానీ మనం కష్టకాలంలో జీవిస్తున్నాం. సమాజం కోసం మనవంతు సాయం చేయడానికి ఇదే సరైన సమయం. కుటుంబాలతో కలిసి ఆహ్లాదంగా గడపండి. స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి. చివరిగా మానసికంగా దృఢంగా ఉండాలి" అంటూ పూర్తి అనుభవాలు చెప్పింది. ఇదిలా ఉండగా నిక్కీ గల్రానీ కృష్ణాష్టమి, మరకతమణి సినిమాలలో నటించింది. ఇక తాజాగా అమ్మడు రంగస్థలం తమిళ రీమేక్ లో ఛాన్స్ కొట్టేసిందట.