హీరో హీరోయిన్ పెళ్లి.. ఇంకా ఏమిటీ మౌనం?

Update: 2020-07-30 04:30 GMT
ఒక అంద‌మైన‌ అమ్మాయి.. తొలి చూపులోనే మ‌న‌సు ప‌డ్డ ఆక‌తాయి అబ్బాయి. ఇంకేం ఉంది.. త‌న వెంట ప‌డ్డాడు. ప్రేమించావా? అని అడుగుతుంది అమ్మాయి. అవును అని త‌డ‌బ‌డుతూనే చెబుతాడు ఆ  అబ్బాయి. అత‌డు ఎప్పుడు ఆ మాట అంటాడా? అని ఎదురు చూసే స‌ద‌రు అల్ల‌రి చిల్ల‌రి చిట్టెమ్మ నేరుగా అత‌గాడి ఇంటికే వ‌చ్చేసి అల్ల‌ర‌ల్ల‌రి చేసేస్తుంది. బీర్ వేస్తావా? అంటూ వైన్ షాప్ కే తీసుకెళ్లేంత స్పీడ్ ఆ అమ్మాయిది. అయ్య‌బాబోయ్ అనుకునేంత అమాయ‌కుడు ఆ అబ్బాయి. ఇదంతా `మ‌లుపు` సినిమాలో ల‌వ్ ట్రాక్. ఈ ట్రాక్ లో అద్భుతంగా న‌టించి మెప్పించిన జంట ఎవ‌రు? అంటే.. ఆది పినిశెట్టి- నిక్కీ గ‌ల్రానీ జంట‌.

చూస్తుంటే ఈ జంట ఆ రోజునుంచే ప్రేమ‌లో మునిగి తేలుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. బ్యూటిఫుల్ నిక్కీతో పినిశెట్టి బోయ్ నిండా మునిగాడు అంటూ ప్ర‌స్తుతం కోలీవుడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ నిక్కీ గ‌ల్రానీ ఎవ‌రో తెలుసు క‌దా?  తెలుగు వారికి బాగా సుప‌రిచిత‌మైన‌ బెంగ‌ళూరు బ్యూటీ సంజ‌న గ‌ల్రానీ సోద‌రిగా నెప్టోయిజం గాళ్ గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది. త‌మిళంలో వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. అక్క‌డ ఆది  పినిశెట్టి స‌ర‌స‌న రెండు సినిమాల్లో న‌టించింది. మ‌లుపు- మ‌ర‌క‌త‌మ‌ణి చిత్రాల‌తో ఇటు తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించారు ఈ జంట‌.

కెరీర్ క‌లిపిన బంధ‌మో.. స్నేహ‌మో ఏమో కానీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమ ప‌ల్లవించింద‌ని త్వ‌ర‌లోనే పెళ్లాడేయ‌బోతున్నార‌ని తాజాగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆది తండ్రి గారైన రవిరాజా పినిశెట్టి పుట్టిన‌రోజు వేడుక‌ల్లో నిక్కీ సంద‌డి చూసిన వారు ఇదే గుస‌గుస‌లాడుతున్నారు. బ‌ర్త్ డే ఫోటోల్లో ఆది చుట్టూనే ఈ అమ్మ‌డు హొయ‌లు పోయింద‌ట‌.  అయితే మ‌లుపు జంట నిజ జీవితంలో కీల‌క మైన ఆ మ‌లుపు గురించి ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌నేలేదు ఎందుక‌నో!  సోష‌ల్ మీడియాల్లో ఏదైనా హింట్ ఇవ్వ‌డ‌మో లేదా ఈ పుకార్ల‌ను ఖండించ‌డ‌మో చేయ‌లేదు ఏమిటో!
Tags:    

Similar News