దిల్ రాజు ఆ మాటనగానే ఊపిరి పీల్చుకుందట

Update: 2016-02-17 22:30 GMT
‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన గుర్తుంది కదా. ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తూ.. తెరంగేట్రం చేసిన అమ్మాయి నిక్కీ గర్లాని. ఇప్పటికే మోడల్ గా బోలెడన్ని ప్రకటనలకు తోడు.. కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన నిక్కీ.. తాజాగా ‘కృష్ణాష్టమి’ సినిమాతో తెలుగులో కూడా అడుగుపెట్టేస్తోంది. ఐతే తెలుగు సినిమా అవకాశం దక్కినట్లే దక్కి చేజారిపోయేలా కనిపించిందని.. ఐతే అదృష్టవశాత్తూ తానీ సినిమాలో నటించగలిగానని అంటోంది నిక్కీ.

‘‘నిజానికి కృష్ణాష్టమి ఆఫర్ వచ్చే సమయానికి నేను ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నా. అక్కడ ఓ సినిమా చేస్తుండగా ఇంకో సినిమా ఒప్పుకోకూడదన్న రూల్ ఉంది. ఆ టైంలోనే ‘కృష్ణాష్టమి’ ఆఫర్ రావడంతో సినిమా చేయడం కుదరదనే అనుకున్నా. కానీ రాజు గారు ఫోన్ చేసి షూటింగ్ మొదలవడానికి ఇంకో నెల రోజులు పడుతుందని, టెన్షన్ పడొద్దని చెప్పడంతో హమ్మయ్యా అనుకున్నా’’ అని నిక్కీ చెప్పింది.

కృష్ణాష్టమి సినిమాలో తాను పల్లవి అనే పాత్ర పోషిస్తున్నానని.. ఆ పాత్ర ‘పల్లవిజం’ అనే పుస్తకం రాస్తుందని, ఇది చాలా వినోదాత్మకమైన పాత్ర అని చెప్పింది నిక్కీ. మోడల్ గా తనకు పది  నెలల్లోనే 35 కమర్షియల్స్ చేసే అవకాశం దక్కిందని.. హీరోయిన్ గా కూడా వరుసబెట్టి అవకాశాలు వస్తున్నాయని.. ఇదంతా అక్క సంజన చెల్లిగా వచ్చిన పేరు వల్లే అని, ఆమె తనకు అక్క కాదు అమ్మ అని నిక్కీ చెప్పింది. హీరో సునీల్ గురించి చెబుతూ.. ‘‘ఆయన చాలా మంచి మనిషి. కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి. విదేశాల్లో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలో మేం ముసుగు తన్ని పడుకుని ఉంటే.. ఆయన లేచి జాగింగ్ చేసేవాళ్లు. అలాంటి వ్యక్తిని నేనెక్కడా చూడలేదు’’ అని పేర్కొంది.
Tags:    

Similar News