చిత్రం : ‘నిన్ను కోరి’
నటీనటులు: నాని - ఆది - నివేదా థామస్ - మురళీ శర్మ - పృథ్వీ - తనికెళ్ల భరణి - సుదర్శన్ - విద్యు తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
స్క్రీన్ ప్లే - కోన వెంకట్
మాటలు: శివ నిర్వాణ - కోన వెంకట్
నిర్మాత: డీవీవీ దానయ్య
కథ - దర్శకత్వం: శివ నిర్వాణ
ఒకటి రెండు కాదు.. వరుసగా ఆరు విజయాలందుకుని తిరుగులేని ఫాంలో కొనసాగుతున్నాడు నాని. తన సినిమా అంటే ఏదో ప్రత్యేకత ఉంటుందనే భరోసా ప్రేక్షకుల్లో కలిగించాడు నాని. ఇప్పుడతను ‘నిన్ను కోరి’ అనే ఫీల్ గుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నాని తన కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా చెప్పుకున్న ‘నిన్ను కోరి’లో అంత ప్రత్యేకత ఏముందో చూద్దాం పదండి.
కథ:
ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమ (నాని) విశాఖపట్నంలో పీహెచ్ డీ చేస్తుంటాడు. అతను తనకు అనుకోకుండా పరిచయమైన పల్లవి (నివేదా థామస్)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. తనకు ఇంట్లో సంబంధాలు చూస్తుండటంతో భయపడ్డ పల్లవి.. పారిపోయి పెళ్లి చేసుకుందామంటుంది. కానీ జీవితంలో స్థిరపడకుండా పెళ్లి వద్దని పీహెచ్ డీ మీద దృష్టిపెడతాడు ఉమ. ఇంతలో అరుణ్ (ఆది)తో పల్లవికి పెళ్లయిపోతుంది. ఇద్దరూ యుఎస్ వెళ్లిపోతారు. తర్వాత ఉమ కూడా ఉద్యోగం కోసం యుఎస్ వెళ్తాడు. కానీ అక్కడ పల్లవి జ్నాపకాల నుంచి బయటపడలేక తాగుడుకు బానిసవుతాడు. ఇది తెలిసి పల్లవి అతణ్ని మార్చాలనుకుంటుంది. తాను వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నానో చూపించడానికి ఉమను తన ఇంటికే పిలుస్తుంది. మరి అతడి రాకతో ఏం జరిగింది.. అరుణ్ - పల్లవి - ఉమల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
జనాలు వినోద ప్రధానంగా ఉన్న సినిమాలకే పట్టం కడుతున్న నేపథ్యంలో ఫీల్ ఉన్న ప్రేమ కథలు అరుదైపోయాయి. అందులోనూ ఈ రోజుల్లో ప్రేమ.. పెళ్లి విషయంలో యువత ఆలోచనలు కూడా మారిపోతున్న నేపథ్యంలో సినిమాల్లో లవ్ ఫీల్ తీసుకురావడం.. దాని చుట్టూ ఎమోషన్లు పండించడం చాలా కష్టమైన వ్యవహారం అయిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ భగ్న ప్రేమికుడి కథను భావోద్వేగాలతో చెప్పాలనుకోవడం సాహసమే. కొత్త దర్శకుడు శివ నిర్వాణ ఆ సాహసమే చేశాడు. కానీ ఇదేమీ ‘అభినందన’ తరహా భారమైన కథ కాదు. ఈ తరం ప్రేక్షకులకూ కనెక్టయ్యే.. జీవితం గురించి మంచి పాఠాలు చెప్పే కథ.
ప్రేమ.. పెళ్లి విషయంలో ఈ తరం యువత ఆలోచనలకు తగ్గట్లుగా తన కథను రాసుకున్నాడు శివ నిర్వాణ. పాత్రలు కూడా కంటెంపరరీగా ఉండేలా చూసుకున్నాడు. కథను వాస్తవికంగా ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు నడిపించాడు. అదే సమయంలో ప్రేమ భావనల్ని.. తన కథలోని భావోద్వేగాల్ని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చూసుకున్నాడు. కాకపోతే ఇలాంటి కథలు పరుగులు పెట్టవు. నెమ్మదిగా సాగుతాయి. నెమ్మదిగానే మనసు లోతుల్లోకి చేరతాయి. అది వాటి లక్షణం. కాబట్టి జానర్ ఏదైనా సరే వినోదమే కోరుకుంటున్న ఈ తరం మెజారిటీ ప్రేక్షకులకు ‘నిన్ను కోరి’ భారంగా.. సాగతీతగా అనిపించొచ్చు. ఐతే ఇందులోని ఫీల్.. ఎమోషన్స్ కు కనెక్టయితే మాత్రం ‘నిన్ను కోరి’ ఓ మంచి జ్నాపకంగా నిలుస్తుంది.
‘లెట్స్ వెల్కం లైఫ్’ అంటూ.. ప్రేమలో విఫలమైతే.. భాగస్వామి దూరమైతే అక్కడితో జీవితం ఆగిపోదని.. మళ్లీ జీవితంలోకి కొత్త ఆనందాలు వస్తాయని.. వాటిని అంగీకరిస్తే జీవితం సంతోషంగా సాగిపోతుందని చెప్పే మంచి ప్రయత్నమే ‘నిన్ను కోరి’. ఈ కథ కొత్తదేమీ కాదు. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లే కొంతమేర బాలీవుడ్ మూవీ ‘హమ్ దిల్ కే చుకే సనమ్’ ఛాయలు ఇందులో కనిపిస్తాయి. ఐతే ఆ పోలికల సంగతి పక్కన పెట్టేసి చూస్తే.. దీని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. బలమైన ప్రధాన పాత్రలు.. ఆ పాత్రల్లో నటీనటుల చక్కటి అభినయం ‘నిన్ను కోరి’కి అతి పెద్ద ప్లస్.
నాని.. ఆది.. నివేదా ముగ్గురూ కూడా ప్రేక్షకుల ఆసక్తిని నిలబెట్టే పెర్ఫామెన్స్ తో ‘నిన్ను కోరి’ని నిలబెట్టారు. నాని గురించి చెప్పేదేముంది. కథ ఎలా ఉన్నా తెరమీద అతను కనిపిస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. ఆ ఆకర్షణ మంత్రాన్ని ‘నిన్ను కోరి’లో కూడా కొనసాగించాడు నాని. ప్రథమార్ధంలో విశాఖ నేపథ్యంలో సాగే సింపుల్ స్వీట్ లవ్ స్టోరీని నాని-నివేదా చక్కగా పండించాడు. వీళ్లిద్దరి పరిచయ సన్నివేశాలు కృత్రిమంగా అనిపించినా.. ఆ తర్వాత ప్రేమకథ మాత్రం సాఫీగా సాగిపోతుంది. అక్కడక్కడా వచ్చే మార్కు చమక్కులు భలేగా పేలాయి. చక్కటి ఫీల్ ఉన్న లవ్ స్టోరీకి వినోదం కూడా తోడవడంతో ప్రథమార్ధం చకచకా సాగిపోతుంది. ప్రేమా.. కెరీరా అనే సంఘర్షణ నేపథ్యంలో ప్రేమకథలో వచ్చే మలుపు చాలా సహజంగా అనిపిస్తుంది.
ఐతే ఓ అమ్మాయి తన మాజీ ప్రేమికుడిని.. తాను తన భర్తతో కలిసి ఎంత సంతోషంగా ఉంటున్నానో చూడమంటూ పది రోజుల పాటు తన ఇంట్లో ఉండమంటూ ఆహ్వానించడం.. అందుకు తన భర్తను కూడా ఒప్పించడం అన్నది అంత సహజంగా అనిపించదు. ఈ విషయంలో ప్రేక్షకుల్ని కన్విన్స్ చేసేలా కొన్ని డైలాగులు ఉన్నప్పటికీ ఈ వ్యవహారం కొంచెం అసహజంగానే అనిపిస్తుంది. అంతకుముందు దాకా వాస్తవికంగా సాగిన కథ.. ఇక్కడ అన్ రియలిస్టిగ్గా అనిపిస్తుంది. దీనికి తోడు ద్వితీయార్ధంలో కథను ఎమోషనల్ గా నడిపించాలా లేక కొంచెం వినోదం పాళ్లు కూడా ఉండేలా చూసుకోవాలా అన్న మీమాంసలో దర్శకుడు కథనాన్ని కొంచెం గందరగోళంగా నడిపించాడు.
సీరియస్ గా కథను నడిపితే ప్రేక్షకులు సినిమాను మరీ భారంగా ఫీలవుతారేమో అని అక్కడక్కడా వినోదం దట్టించారు. నవ్వులైతే పండాయి కానీ.. ఆ క్రమంలో అసలు కథ పక్కకు వెళ్లిపోయింది. మళ్లీ ప్రి క్లైమాక్స్ దగ్గర కథ మీద.. భావోద్వేగాల మీద దృష్టిపెట్టాడు దర్శకుడు. ఇక్కడ వచ్చే సన్నివేశాలు కదిలిస్తాయి. ఐతే క్లైమాక్స్ మరింత బలంగా ఉండాల్సిందేమో అనిపిస్తుంది. పతాక సన్నివేశం కన్విన్సింగ్ గానే అనిపించినా.. మరీ సింపుల్ గా సినిమాను ముగించేసిన భావన కలుగుతుంది. కథ కంచికి చేరాక నాని ఎమోషనల్ అయ్యే తీరు మాత్రం కన్నీళ్లు పెట్టించేస్తుంది. ఓవరాల్ గా ‘నిన్ను కోరి’ మంచి ఫీల్ ఉంది.. ఎమోషన్ ఉంది. ప్రేమ భావనల్ని అనుభూతి చెందే వాళ్లందరికీ ‘నిన్ను కోరి’ కనెక్టవుతుంది. వాళ్ల మనసుల్లో నిలిచిపోతుంది. కానీ ఇది అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తుందా అన్నది మాత్రం సందేహమే. ఉన్నంతలో కామెడీ పంచులు కూడా బాగానే పేలినప్పటికీ.. ఆ డోస్ సరిపోదేమో. నాని నటించిన గత కొన్ని సినిమాల్లో మాదిరి వినోదమే ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.
నటీనటులు:
నాని నటన గురించి చెప్పాల్సి వచ్చినపుడల్లా మాటలు రొటీన్ అయిపోతున్నాయి. బాగా చేశాడని కాకుండా ఇంకేం చెప్పగలం. ‘నిన్ను కోరి’లో మరింత బాగా చేశాడనే చెప్పాలి. ప్రతి సన్నివేశంలోనూ అతడి ఆత్మవిశ్వాసం.. పరిణతి కనిపిస్తుంది. తనకు దూరమైన ప్రేయసి కళ్ల ముందే ఉండగా.. భగ్న ప్రేమికుడిగా తన గుండె లోతుల్లోని బాధను చెప్పే సన్నివేశంలో నాని నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చివర్లో తన ప్రేమను మరోసారి త్యాగం చేసిన సమయంలో భావోద్వేగాలు అదుపు చేసుకోలేక తల్లడిల్లే సన్నివేశంలోనూ నాని కన్నీళ్లు పెట్టించేశాడు. ఈ సీరియస్ కథలో వినోదం పండించే బాధ్యత కూడా నానీనే తీసుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగానే నవ్వించాడు నాని. నివేదా థామస్ నానికి దీటుగా నటించింది. ఆమె హావభావాలు కట్టిపడేస్తాయి. మామూలు సన్నివేశాల్లో కూడా కళ్లతో చక్కటి భావాలు పలికిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది నివేదా. ఎమోషనల్ సీన్స్ లో నివేదా కూడా పరిణతితో నటించింది. ఆది సైతం హుందాగా.. మెచ్యూర్డ్ గా నటించాడు. ‘సరైనోడు’లో ఆదిని చూసి.. ఈ సినిమాలో అతణ్ని చూస్తే ఆశ్చర్యపోతాం. భావోద్వేగాలు పలికించడంలో ఆది ప్రత్యేకత ఈ సినిమాలో కనిపిస్తుంది. మురళీ శర్మ కూడా బాగా చేశాడు. పృథ్వీ తన సహజ శైలికి భిన్నంగా పెద్దగా హడావుడి లేకుండా వినోదం పంచే ప్రయత్నం చేశాడు. సుదర్శన్.. విద్యు కూడా ఓ మోస్తరుగా వినోదాన్నందించారు.
సాంకేతికవర్గం:
కథకు తగ్గ టెక్నీషియన్స్ ను ఎంచుకోవడం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. గోపీసుందర్ మంచి ఫీల్ ఉన్న సంగీతంతో సినిమాకు బలంగా నిలిచాడు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. అడిగా అడిగా.. ఉన్నట్టుండి గుండె.. టైటిల్ సాంగ్.. వెంటాడతాయి. నేపథ్య సంగీతం కూడా చక్కగా కుదిరింది. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం సినిమాలో మరో హైలైట్. ‘ప్రేమమ్’ తరహాలోనే కథను అర్థం చేసుకుని అందుకు తగ్గ క్లాస్ విజువల్స్ తో ఆకట్టుకున్నాడు కార్తీక్. ఇటు వైజాగ్ ను.. అటు యుఎస్ ను అందంగా చూపించడమే కాదు.. సినిమాకు దృశ్యపరంగా కూడా ఫీల్ తీసుకురాగలిగాడు కార్తీక్. నిర్మాణ విలువల విషయంలో రాజీ లేదు. మంచి క్వాలిటీ కనిపిస్తుంది. దర్శకుడు శివ నిర్వాణ.. కోన వెంకట్ కలిసి రాసిన మాటలు బాగున్నాయి. ‘‘దమ్ బిరియానీని ఎవడైనా షేర్ చేసుకుంటాడు.. కానీ దరిద్రాన్ని కూడా షేర్ చేసుకునేవాడే ఫ్రెండు’’.. ‘‘నువ్వు నా లైఫ్ లో వేలెట్టావంటే.. నేను నీ లైఫ్ లో కాలెట్టేస్తాను’’ లాంటి మాటల్లో కోన మార్కు కనిపిస్తుంది. అదే సమయంలో.. ‘‘నా కళ్లలోకి చూసి మాట్లాడితే వచ్చే కన్నీళ్ల వల్ల మన ప్రేమను కమ్మేసిన మబ్బు కరిగిపోతుందని భయమా?’’ లాంటి డెప్త్ ఉన్న ఎమోషనల్ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. దర్శకుడిగా శివ తొలి సినిమాతో తన ప్రతిభ చాటుకున్నాడు. అతను ఎంచుకున్న కథ కంటెంపరరీగా ఉంది. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ను అతను డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. కాకపోతే అతడి నరేషన్ స్లోగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల మెప్పించి.. కొన్నిచోట్ల నిరాశ పరిచాడు. నిలకడ తప్పింది. కానీ ఓవరాల్ గా అతడికి మంచి మార్కులే పడతాయి.
చివరగా: నిన్ను కోరి.. ‘నెమ్మదిగా’ మనసు లోతుల్లోకి!
రేటింగ్- 2.75/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre