నిశ్శబ్దంగా పని కానిచ్చేస్తున్న 'నిశ్శబ్దం'...!

Update: 2020-05-16 10:30 GMT
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో చిత్ర పరిశ్రమ మూతపడింది. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ లు క్లోజ్ అయ్యాయి. సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. దీంతో ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేని ప‌రిస్థితుల‌లో నిర్మాత‌లు త‌మ చిత్రాల‌ని డిజిటల్ ప్లాట్‌ ఫార్మ్ లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలుగులో ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుద‌ల అయింది. అంతేకాకుండా లాక్‌ డౌన్‌ సమయాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. విడుదలకు సిద్దంగా ఉండి లాక్‌ డౌన్‌ తో విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాలకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు సిద్దమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా 8 సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి సిద్ధమయ్యాయి. తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా మే 29న ఓటీటీలో రాబోతోందని అఫిసియల్ గా ప్రకటించారు. 'మహానటి' కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘పెంగ్విన్’ చిత్రాన్ని కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో జూన్ 19న‌ విడుద‌ల చేస్తున్న‌ట్టు అఫీషియ‌ల్‌ గా ప్ర‌క‌టించారు. అమితాబ్ బచ్చన్ - ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన హిందీ చిత్రం 'గులాబో సితాబో' మరియు విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శ‌కుంతల దేవి'.. అలాగే కన్నడ 'లా' మరియు 'ఫ్రెంచ్ బిర్యానీ' కూడా ఓటీటీలో రిలీజ్ అవబోతున్నాయి. మలయాళ 'సూపియుమ్ సుజాతయుమ్' సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది.

ఈ నేపథ్యంలో అనుష్క- మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'నిశ్శబ్దం' మూవీ కూడా ఓటీటీలో విడుదల కానుందని వార్తలు వచ్చాయి. కానీ నిర్మాతలు ఈ విషయాన్ని ఖండించారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఒక ప్రముఖ ఓటీటీ 'నిశ్శబ్దం'తో నిర్మాతలతో చర్చిస్తున్నారట. అయితే ఓటీటీకి రెండు కండిషన్స్ పెడుతున్నారట. వాటిలో ఒకటి డబ్బులకు సంబంధించింది కాగా రెండోది'నిశ్శబ్దం' థియేట్రికల్ రిలీజ్ గురించి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఎక్జిబిటర్స్ అనుమతిస్తే థియేటర్స్ లో కూడా రిలీజ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని చేస్తున్నారట. వాస్తవానికి ఈ సినిమా జనవరిలో రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని కారణాలతో సమ్మర్ కి వాయిదా పడింది. ఇప్పుడు కరోనా కారణంగా ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ లో అంజలి, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ మరియు కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు.
Tags:    

Similar News