థియేటర్స్ రిలీజ్ అయ్యే సినిమాకి పైరసీ భూతం పెద్ద సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ని విధాలుగా అడ్డుకున్నా ఏదొక రూపంలో పైరసీ సైట్స్ లో కొత్త సినిమాలు దర్శనం ఇస్తూనే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు డైరెక్ట్ గా విడుదల అవుతుండటంతో ఇది మరింత ఎక్కువైపోయింది. ఇంతకముందు థియేటర్ ప్రింట్ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు రిలీజైన కొన్ని నిమిషాల్లోనే హెచ్ డీ ప్రింట్ అందుబాటులో ఉంటోంది. దీంతో కొన్ని లోకల్ ఛానల్స్ అత్యుత్సాహంతో ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలను మంచి క్వాలిటీతో తమ ఛానల్స్ లో ప్రసారం చేస్తున్నారు. తాజాగా 'నిశ్శబ్దం' టీమ్ మరియు అమెజాన్ ప్రైమ్ ఓటీటీకి హైదరాబాద్ కి చెందిన ఓ లోకల్ ఛానల్ షాక్ ఇచ్చింది.
దక్షిణాది అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ''నిశ్శబ్దం'' అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 2న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ మరియు సినీ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ ప్రచారం చేస్తూనే వస్తోంది. అయితే ఈ సినిమా విడుదలై వారం రోజులు కూడా కాకముందే ఆ లోకల్ ఛానల్ వారు త్వరలోనే టెలికాస్ట్ చేస్తామంటూ టీవీ యాడ్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న 'నిశ్శబ్దం' టీమ్ సదరు ఛానల్ వారికి లీగల్ నోటీస్ పంపించిందని సమాచారం. దీనికి రూ. 1.1 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. అలానే ఈ సినిమా హక్కులు తీసుకున్న అమెజాన్ ప్రైమ్ కూడా రూ. 30 లక్షల జరిమానా కట్టాలని లోకల్ ఛానల్ కి నోటీసులు పంపింది. ఇది నిజమే అనడానికి దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ న్యూస్ రాసిన ఓ వెబ్ సైట్ లింక్ ను రీట్వీట్ చేయడం ద్వారా ధృవీకరించారు.
నిజానికి ఈ సినిమా రిలీజ్ అప్పుడే 'నిశ్శబ్దం' టీమ్ పైరసీ చేసినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. ఎక్కడైనా టెలికాస్ట్ అయితే మా దృష్టికి తీసుకురండి అని ప్రకటనలు కూడా ఇచ్చింది. ఇటీవల సత్యదేవ్ నటించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా విషయంలో కూడా ఇలాంటి వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇదంతా చూస్తుంటే స్థానిక ఛానల్స్ డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ మీద అవగాహన లేకపోవడం వల్లనే ఇలాంటివి చేస్తున్నారని అర్థం అవుతోంది. ఇప్పటికైనా లోకల్ ఛానల్స్ వారు రైట్స్ గురించి తెలుసుకోకపోతే ఇబ్బందుల్లో పడకతప్పదు.