బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ లని అందించినా ఒక్కోసారి నచ్చిన స్టార్ తో కలిసి వర్క్ చేయాలంటే ఓపికగా ఎదురుచూడాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. హిట్ ని క్యాష్ చేసుకునే టైమ్ దాటిపోతున్నా అనుకున్న స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కొంత మంది నెలలు గడుస్తున్నా వెయిటింగ్ లిస్ట్ లో ఎదురుచూస్తూ వుండాల్సి వస్తుంది. ఇప్పడు ఇదే తరహాలో ఓ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల స్టార్ హీరో మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
ఛలో, భీష్మ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ లని సొంతం చేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల. నితిన్ తో చేసిన 'భీష్మ' తరువాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు రెడీ అయిపోయాడు. ప్రాజెక్ట్ సెట్టయింది. చిరు లైన్ విన్నారు. ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కానీ ఇంత వరకు సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
దీంతో మెగాస్టార్ షూటింగ్ కి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? అని దర్శకుడు వెంకీ కుడుముల ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే వెంకీని చిరు వెయిటింగ్ లో పెట్టడాపనికి చాలా కారణాలున్నాయి. మెగాస్టార్ ప్రస్తుతం మూడు బారీ ప్రాజెక్ట్ లు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో బిజీ బిజీ గా గడిపేస్తున్నారు. మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా రూపొందుతున్న 'గాడ్ ఫాదర్', తమిళ హిట్ ఫిల్మ్ 'వేదాలం' ఆధారంగా 'భోళా శంకర్', స్ట్రెయిట్ స్టోరీలో బాబి డైరెక్ట్ చేస్తున్న 'వాల్తేర్ వీరయ్య' సినిమాల్లో నటిస్తున్నారు.
ఇందులో 'గాడ్ ఫాదర్' దసరాకు థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. ఇక బాబి రూపొందిస్తున్న 'వాల్తేరు వీరయ్య' వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావాలని రిలీజ్ టైమ్ ని ఫిక్స్ చేశారు.
ఇక మోహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న 'భోళా శంకర్' రిలీజ్ కి ఇంకా టైమ్ ఫిక్స్ చేయలేదు కానీ ఈ మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ జరుగుతూనే వున్నాయి. వీటిని పూర్తి చేసిన తరువాతే మిగతా సినిమాలని స్టార్ట్ చేయాలన్నది మెగాస్టార్ ఆలోచన.
ఆ కారణంగానే వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ని చిరు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారట. ఇదిలా వుంటే తాజాగా వెంకీ కుడుముల ఫైనల్ వెర్షన్ ని చిరుకు వివరించారని, అయితే చిరు నుంచి ఇంకా ఫైనల్ కాల్ రాలేదని తెలిసింది. దేశభక్తితో సాగే సందేశాత్మక కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారట.