నితిన్ ముందే హింట్ ఇచ్చాడు

Update: 2015-08-28 15:35 GMT
టాలీవుడ్ లో ఏ అరంగేట్ర హీరోకూ లేనంత హంగామా జరుగుతోంది అక్కినేని అఖిల్ అరంగేట్ర సినిమాకు సంబంధించి. ఇంకా సినిమా మొదదలుపెట్టకముందే ఈ కుర్రాడికి హైప్ వచ్చేయడం.. వి.వి.వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ అఖిల్ ను ఇంట్రడ్యూస్ చేస్తుండటంతో ఈ మాత్రం హంగామా జరగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రారంభోత్సవం నాటి నుంచి వార్తల్లో ఉంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ ఆసక్తి రేపిన విషయం.. టైటిల్. దీని గురించి మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. మిసైల్ అని, తాండవం అని.. ఇంకేదో టైటిల్ అని చాలా రూమర్లు వినిపించాయి. కానీ వాటన్నింటికీ తెరదించేసి.. అఖిల్ పేరునే టైటిల్ గా పెట్టేసి అందరికీ షాకిచ్చారు వినాయక్, నితిన్.

ఐతే ఈ టైటిల్ విషయంలో యూనిట్ సభ్యులు తలలు బద్దలు కొట్టుకున్నట్లేమీ లేదు. ఇంతకుముందు ప్రచారంలోకి వచ్చినట్లు మిసైల్, తాండవం అనే టైటిళ్లు అసలు కన్సిడరేషన్ లోనే లేవు. అవి ఎవరో ప్రచారంలోకి తెచ్చారు. వాటిని మీడియా హైలైట్ చేసింది. ఆ టైటిళ్లు చూసి వినాయక్ అండ్ కో నవ్వుకుని ఉంటారు. ఎందుకంటే సినిమా మొదలవకముందే టైటిల్ ఫిక్సయిపోయింది. ఈ విషయంలో నితిన్ ఓ హింటు కూడా ఇచ్చాడు. మామూలుగా సినిమాకు టైటిల్ పెట్టనపుడు ప్రొడక్షన్ నెంబర్ వన్ అనో.. త్రీ అనో బ్యానర్ లో వచ్చిన  సినిమా నంబర్లను బట్టి మొదలుపెడతారు. కానీ అఖిల్ సినిమాకు మాత్రం నితిన్.. ‘ప్రొడక్షన్ ఎ’ అని మొదలుపెట్టాడు. నంబర్ లేకుండా ఇలా ‘ఎ’ అని అక్షరం పెట్టడం ఏంటని చాలామందికి డౌటొచ్చింది కానీ.. దాని గురించి చర్చేమీ జరగలేదు. ఐతే నితిన్ టైటిల్ విషయంలో ఇన్ డైరెక్టుగా హింట్ ఇచ్చాడు. కానీ జనాలకే అర్థం కాలేదు. ఇప్పుడు టైటిల్ అనౌన్స్ చేశాక అందరికీ విషయం బోధపడింది.
Tags:    

Similar News