టాలీవుడ్ హీరో నితిన్ నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో అప్పట్లో కొన్ని మాంచి సినిమాలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎలాంటి సినిమా చేసినా కూడా రివర్స్ అవుతున్నాయి. అలాగే మరోవైపు నితిన్ కూడా వరుస పరాజయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. నితిన్ ఇంతకుముందు చేసిన రంగ్ దే చెక్ ఇలా వరుసగా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.
ఆ సినిమాలు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తీసుకు రాలేకపోయాయి. దీంతో నితిన్ కాస్త అప్సెట్ అయ్యాడు అనే చెప్పాలి. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ గా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును అందుకున్న వారు.
అయితే వీరి సంస్థలో ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాయి. రీసెంట్ గా వచ్చిన విక్రమ్ సినిమా మాత్రం మంచి ప్రాఫిట్స్ అందించే ప్రయత్నం చేసింది.
లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నట్లే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఇక చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ కూడా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ హిట్ అయితే కొట్టేసాడు.
ఇక తెలుగులో ఈ సినిమాను ప్రత్యేకంగా శ్రేష్ట మూవీస్ లో నితిన్ తండ్రి భారీగానే విడుదల చేయడం జరిగింది. దాదాపు ఆరు కోట్లకు ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను కొనుగోలు చేశారు. అయితే విక్రమ్ సినిమా ఆది వారం ముగిసే లోపు ఈ సినిమాకు సంబంధించిన పెట్టుబడిని మొత్తం వెనక్కి టెచ్చినట్లు తెలుస్తోంది ఇక సోమవారం నుంచి వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా లాభాలే అని చెప్పవచ్చు.
ఏదేమైనా వరుస అపజయలతో కాస్త అప్సెట్ అయిన నితిన్ ప్రత్యేకంగా విక్రమ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయించి హోమ్ బ్యానర్ కు లాభాలు వచ్చేలా చేసాడు. మరి ఫుల్ రన్ లో సినిమా టోటల్ గా ఎంత ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.