కరోనా కారణంగా ఆరు నెలలుగా పెద్ద హీరోలు ఒక మోస్తరు హీరోలు షూటింగ్స్ కు హాజరు కావడం లేదు. దాంతో చాలా సినిమాలు కూడా మద్యలో ఆగిపోయాయి.. కొన్ని వారం పది రోజులు ఇరువై రోజుల షూటింగ్ బ్యాలెన్స్ తో అసంపూర్తిగా ఉండిపోయాయి. దాంతో మద్యలో ఉన్న సినిమాలను చివరి దశలో షూటింగ్ ఉన్న సినిమాలను పూర్తి చేసేందుకు యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా సిద్దం అవుతున్నారు. విడుదల ఎప్పుడు ఎలా అనేది పక్కన పెడితే సినిమాను పూర్తి చేసి అయితే ఒక పనైపోగొట్టుకుందాం అన్నట్లుగా హీరోలు భావిస్తున్నారు అనిపిస్తుంది.
ఇప్పటికే నాగచైతన్య తన లవ్ స్టోరీ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. రెండు వారాల్లో షూటింగ్ ను పూర్తి చేసి మరో ప్రాజెక్ట్ పై పడబోతున్నాడు. ఎప్పుడు విడుదల అయ్యేది క్లారిటీ లేకున్నా షూటింగ్ పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా నితిన్ కూడా తన 'రంగ్ దే' సినిమాను పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లో రంగ్ దే చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా యూరప్ వెళ్లి దాదాపు నెల రోజుల్లో షూటింగ్ ను ముగించేయనున్నారు. హడావుడిగా షూటింగ్స్ చేస్తున్నంత మాత్రాన ఓటీటీ విడుదల కోసం అని కాదు అంటూ కొందరు అంటున్నారు.
ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు ఒకటి రెండు ఓటీటీల్లో విడుదల అయ్యేందుకు ఆసక్తి చూపిస్తుండగా ఎక్కువ శాతం మాత్రం షూటింగ్ ముగించి థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయాలని భావిస్తున్నారట. షూటింగ్ విషయంలో ఒక బాధ్యత పూర్తి అవుతుందనే ఉద్దేశ్యంతో హీరోలు కూడా రిస్క్ అయినా షూటింగ్ కు వస్తున్నారు. రంగ్ దే షూటింగ్ ను పూర్తి చేసిన తర్వాత అంధాదున్ రీమేక్ ను నితిన్ మొదలు పెట్టబోతున్నాడు. ఆ తర్వాత పవర్ పేట కూడా నితిన్ చేయాల్సి ఉంది. అందుకే రంగ్ దే బాధ్యత మొదట నెరవేర్చబోతున్నాడు. రంగ్ దేకు ఇప్పటికే ఓటీటీ నుండి భారీ ఆఫర్స్ వచ్చాయట. కాని ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.