నితిన్ వెనుకబడిపోయాడే..

Update: 2017-08-15 09:37 GMT
గత శుక్రవారం విడుదలైన మూడు కొత్త సినిమాలు వారాంతంలో.. ఆ తర్వాత కూడా బాగానే వసూళ్లు రాబడుతున్నాయి. ఐతే వీటిలో ఒక్క ‘నేనే రాజు నేనే మంత్రి’ మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుక్కారణం దీనిపై పెట్టుబడి తక్కువ కావడమే. కంటెంట్ వీక్ అయినా.. టాక్ ఏమంత గొప్పగా లేకపోయినప్పటికీ ప్రచారం గట్టిగా చేయడం వల్ల.. రానాకు ఉన్న క్రేజ్ వల్ల ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అంచనాల్ని మించి వచ్చాయి. తొలి వారాంతంలో వరల్డ్ వైడ్ రూ.10.8 కోట్ల షేర్ రాబట్టింది ‘నేనే రాజు నేనే మంత్రి’. సోమ.. మంగళవారాల్లో కూడా సెలవు కాబట్టి ఐదు రోజులకు రూ.15 కోట్ల దాకా షేర్ రావచ్చని అంచనా వేస్తున్నారు. అంటే సినిమా దాదాపుగా సేఫ్ జోన్లోకి వచ్చేసినట్లే.

ఇక మూడు సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘జయ జానకి నాయక’ ఫస్ట్ వీకెండ్లో వరల్డ్ వైడ్ రూ.9 కోట్ల షేర్ రాబట్టింది. ఐతే ఈ చిత్రానికి తొలి రోజు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. జనాల ఫోకస్ ప్రధానంగా మిగతా రెండు సినిమాల మీదే నిలవడంతో తొలి రెండు షోల కలెక్షన్లపై ప్రభావం పడింది. కానీ తొలి రోజు సాయంత్రం నుంచి సినిమా పుంజుకుంది. బి-సి సెంటర్లలో ఈ సినిమా అదరగొడుతోంది. మిగతా రెండు సినిమాలతో పోలిస్తే ‘జయ జానకి నాయక’కు లాంగ్ రన్ ఉంటుందని భావిస్తున్నారు. ఫుల్ రన్లో ఈ సినిమా సేఫ్ జోన్లోకి రావచ్చేమో. ఇక నితిన్ మూవీ ‘లై’ విషయానికొస్తే.. ఆ చిత్రం ఫస్ట్ వీకెండ్లో ఏడున్నర కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడితో పోలిస్తే ఈ వసూళ్లు అంత ఆశాజనకంగా లేనట్లే. ‘ఎ’ సెంటర్లకు పరిమితమైన సినిమా కావడం ప్రతికూలంగా మారింది. మిగిలిన రెండు సినిమాలు మాస్ ప్రేక్షకులకు చేరువ కావడంతో ‘లై’ వసూళ్లపై ప్రభావం పడింది. సిటీల్లో.. యుఎస్ లో మంచి వసూళ్లే వస్తున్నప్పటికీ.. పరిస్థితి అంత సానుకూలంగా అయితే కనిపించట్లేదు. బుధవారం నుంచి ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందన్నదాన్ని బట్టి ఫైనల్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.
Tags:    

Similar News