ట్రంప్ బిల్డింగ్ లో నితిన్ అబద్దం

Update: 2017-05-26 09:39 GMT
అ..ఆ లాంటి బంపర్ హిట్ కొట్టిన తర్వాత హీరో నితిన్ ఆచితూచి ముందడుగు వేస్తున్నాడు. నితిన్ కెరీర్ లో అతి పెద్ద హిట్ అ.. ఆ. ఎప్పుడూ సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వచ్చే అలవాటున్న నితిన్ ఈసారి కాస్త గ్యాపిచ్చాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో సినిమా ఓకే చేశాడు. లై (అబద్ధం) పేరుతో తెరకెక్కున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

లై సినిమా యూనిట్ ప్రస్తుతం యూఎస్ లో ఉంది. కాలిఫోర్నియా బ్యూటిఫుల్ లొకేషన్లలో సినిమాకు సంబంధించి క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. దీని తర్వాత చికాగో లోని ట్రంప్ టవర్ లో షూటింగ్ చేస్తున్నారు. లొకేషన్ షూటింగ్ స్పాటు దగ్గర అమెరికాలోని తన పలుకబడి వాడి.. నిర్మాత అనిల్ సుంకర్ చాలా ఘనమైన ఏర్పాట్లు చేసినట్లే తెలుస్తోంది. అందుకే ట్రంప్ టవర్ వారు కూడా ఆయన క్రూను సాదరంగా ఆహ్వానించారు. హను రాఘవపూడి ముందు రెండు చిత్రాలు దాదాపుగా లోకల్ లోనే తీసినా విజువల్ ఎట్రాక్షన్ ఎక్కడా తగ్గలేదు. అలాంటిది ఈసారి మంచి ఫారిన్ లొకేషన్లలో సినిమా తీస్తుండటం లై సినిమాకు మంచి ప్లస్ పాయింటయ్యే అవకాశముంది.

అయినా అసలే ట్రంపు దెబ్బకు ఫారిన్ లో ఉన్న మనవాళ్లంతా బెదిరిపోతుంటే నితిన్ మాత్రం ఏకంగా ట్రంపు టవర్ కు వెళ్లి అబద్ధాలు చెబుతుండటం కాస్తంత విశేషమే. ఈ సినిమాలో కొత్తమ్మాయి మేఘా ఆకాష్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అవుతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News