మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమాను నిర్మించి హిట్ కొట్టిన నిర్మాత మధు ఆ సినిమా తర్వాత ఠాగూర్ మధుగా మారిపోయాడు. పేరులో ఠాగూర్ అని చేర్చుకున్న కారణంగానో లేక మరేంటో కాని ఠాగూర్ మినహా ఇప్పటి వరకు ఈ నిర్మాతకు కమర్షియల్ గా మంచి హిట్ పడినదే లేదు. పలు సినిమాలను నిర్మించడం.. డిస్ట్రిబ్యూట్ చేయడం.. డబ్ చేయడం చేస్తూనే ఉన్నా ఠాగూర్ మధుకు మాత్రం అబ్బ అదిరింది అన్న స్థాయిలో ఇప్పటి వరకు సక్సెస్ పడలేదు.
ఎన్ని ఫ్లాప్స్ పడ్డా కూడా ఠాగూర్ మధు మాత్రం సినిమాల నిర్మాణంను ఆపడటం లేదు. ప్రస్తుతం నితిన్ తో ‘అంధాదున్’ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు. గత ఏడాది అర్జున్ సురవరం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నిర్మాత ఎప్పటిలాగే నిరాశే పడ్డాడు. కమర్షియల్ గా భారీ నష్టాలు రాకున్నా లాభాలు కూడా వచ్చి ఉండవు అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఠాగూర్ మధు చేస్తున్న ఈ ప్రయత్నం అయినా సక్సెస్ అయ్యేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక మీడియం రేంజ్ బడ్జెట్ లో అంధాదున్ ను మధు రీమేక్ చేస్తున్నాడు. ఇటీవలే ప్రారంభం అయిన ఈ రీమేక్ ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మెగా హీరోలు మరియు నిర్మాత అల్లు అరవింద్ సపోర్ట్ ఠాగూర్ మధుకు ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఆ సపోర్ట్ కారణంగానే ఇన్నాళ్లు ఫ్లాప్స్ వచ్చినా నెట్టుకు వచ్చాడని అంటున్నారు. మరి అంధాదున్ రీమేక్ తో అయినా ఠాగూర్ మధుకు సక్సెస్ దక్కేనా చూడాలి.