కులం పేరుతో దూష‌ణ‌.. యంగ్ హీరో కౌంట‌ర్

నెటిజ‌నుల మ‌న‌స్త‌త్వం చిత్ర‌విచిత్ర‌మైన‌ది. ఇక్క‌డ నెగెటివిటీ రాజ్య‌మేలుతుంది. కుట్ర‌లు కుతంత్రాల‌కు తెర తీస్తారు.;

Update: 2025-03-18 13:08 GMT

నెటిజ‌నుల మ‌న‌స్త‌త్వం చిత్ర‌విచిత్ర‌మైన‌ది. ఇక్క‌డ నెగెటివిటీ రాజ్య‌మేలుతుంది. కుట్ర‌లు కుతంత్రాల‌కు తెర తీస్తారు. ఒక వ‌ర్గం ఇంకో వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తుంది. అంతేకాదు కుల‌మ‌తాలు, వ‌ర్గ వ‌ర్ణ వైష‌మ్యాలు కూడా సోష‌ల్ మీడియాల్లో బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఒక డెబ్యూ హీరోని కులం పేరుతో కొంద‌రు దూషించారు. దీనికి ఇప్పుడు అత‌డు ధీటైన కౌంట‌ర్ ఇవ్వ‌డంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ యువ‌హీరో మ‌రెవ‌రో కాదు.... జాన్వీ కపూర్ ప్రియుడు శిఖర్ పహారియా. అత‌డు కులం పేరుతో తనను టార్గెట్ చేసిన ట్రోలర్ల పై ఎటాక్ చేసాడు. త‌న‌దైన స్టైల్లో విమర్శలు గుప్పించాడు.

శిఖర్ పహారియా గత సంవత్సరం దీపావళి వేడుకల నుండి తన పెంపుడు జంతువు.. అలాగే ప్రియురాలు జాన్వీ కపూర్ ల‌తో ఉన్న‌ కొన్ని అందమైన ఫోటోల‌ను నెట్‌లో షేర్ చేసాడు. ఈ ఫోటోలపై నెటిజ‌నులు కుల దూష‌ణ‌కు పాల్ప‌డ్డారు. అత‌డిని ద‌ళితుడు అని కామెంట్ చేసారు. శిఖర్ పహారియా ఆ వ్యాఖ్యను గమనించకుండా అనాలోచితంగా ఆ నెటిజ‌నుడి కామెంట్ కి చప్పట్లు కొడుతున్న ఈమోజీని షేర్ చేసాడు.

తన ఇన్‌స్టా పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ.. శిఖర్ పహారియా ఇలా రాసాడు. 2025లో మీలాంటి చిన్న మెద‌డుతో వెనుకబడిన మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇంకా ఉండటం నిజంగా విచారకరం... అని కౌంట‌ర్ వేసాడు. దీపావళి అనేది మీ పరిమిత తెలివితేటలకు మించిన వెలుగు, పురోగతి, ఐక్యత భావనల పండుగ. భారతదేశ బలం దాని వైవిధ్యం సమగ్రతలో ఉంది. నువ్వు గ్రహించలేకపోతున్నావు. బహుశా అజ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి బదులుగా మిమ్మల్ని మీరు విద్యావంతులను చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ నిజంగా `అంటరానిది` మీ ఆలోచనా స్థాయి మాత్రమే! అని ప‌దునైన ప‌ద‌జాలంతో నెటిజ‌న్ కి కౌంట‌ర్ ఇచ్చాడు.

శిఖర్ పహారియా మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. అతడి తల్లి స్మృతి షిండే ఒక నటి. అతడి అన్నయ్య వీర్ పహారియా ఇటీవల అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్‌లతో కలిసి నటించిన స్కై ఫోర్స్ లో న‌టించాడు. ఇది యావ‌రేజ్ గా ఆడింది. శిఖర్ పహరియా - జాన్వీ కపూర్ ఇప్పటివరకు తమ సంబంధం గురించి వచ్చిన పుకార్లను ఖండించలేదు లేదా అంగీకరించలేదు. అయితే ఆ ఇద్ద‌రూ మంచి స్నేహితులు. రెగ్యుల‌ర్‌గా పార్టీలు, ఈవెంట్‌లు, సినిమా ప్రదర్శనలు, కుటుంబ కార్యక్రమాలలో కలిసి కనిపిస్తారు.

Tags:    

Similar News