మహేష్-రాజమౌళి.. ప్రియాంకతో భయంకరమైన ట్విస్ట్?
సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29 సినిమాపై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే.;
సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29 సినిమాపై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక అప్‌డేట్స్ తక్కువగా ఉన్నా, లీక్‌లు మాత్రం గట్టిగానే బయటకొస్తున్నాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఒడిశా షెడ్యూల్ లో చిత్రీకరణ జరుగుతుండగా కొన్ని సన్నివేశాల వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో చిత్రబృందం మరింత కఠినమైన రూల్స్ అమలు చేస్తోంది.
అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ సినిమాకు జాయిన్ అవుతుందన్న టాక్ ఊపందుకుంది. ప్రియాంక ఇందులో ఏ పాత్ర చేస్తుందనేదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఓ షాకింగ్ రూమర్ ప్రకారం, ఆమె పాత్రతో జక్కన్న భయంకరమైన ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది పూర్తిగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతోందట. త్రెడిషనల్ హీరోయిన్‌గా కాకుండా, నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర కోసం రాజమౌళి ఆమెను ఎంపిక చేశారని సమాచారం.
రాజమౌళి సినిమాలో.నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కాస్త భయపెట్టే విధంగానే ఉంటాయి. విలన్స్ రోల్స్ వామ్మో అనేల ఉంటాయి. అయితే ఇప్పటివరకు ఎక్కువగా హీరోయిన్ల మృదువైన, సానుకూల పాత్రల్లో చూపించిన, రాజమౌళి మాత్రం తన కథలో విభిన్నతను మేళవించడంలో సిద్ధహస్తుడు. అదే నిజమైతే, ఇది ప్రియాంక చోప్రా కెరీర్‌లో వినూత్నమైన క్యారెక్టర్ అవుతుందన్న మాట.
ఇప్పటికే ఒడిశాలోని కొరాపుట్ జిల్లా అడవుల్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. సెట్స్‌లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, స్ట్రిక్ట్ నిబంధనలు అమలు చేస్తున్నారు. లొకేషన్‌లో ఫోన్ వాడకం నిషేధించడంతో పాటు, ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా పూర్తిగా నియంత్రిస్తున్నారు. అంతేకాదు, హీరోలు, టెక్నీషియన్స్ కూడా కేవలం చాలా తక్కువ మంది అసిస్టెంట్స్‌తో షూటింగ్ చేయించుకుంటున్నారు. బాలీవుడ్‌లో అత్యధిక మంది సహాయకులను వెంటబెట్టుకుని తిరిగే ప్రియాంక చోప్రాకు కూడా కేవలం ఇద్దరిని మాత్రమే అనుమతించినట్లు సమాచారం.
ఇది రాజమౌళి సినిమాల్లో ఉన్న డిసిప్లిన్‌కు మరో నిదర్శనం. ప్రియాంక చోప్రా నెగటివ్ షేడ్ పాత్రలో నటించనున్నారనే టాక్ వినిపిస్తున్నా, దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. రాజమౌళి గత చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మగధీర, బాహుబలి వంటి చిత్రాల్లో విలన్స్ పాత్రలకు ఎంతమంది ఫిదా అయ్యారో అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి పాత్రలో ఒక ఇంటర్నేషనల్ ఐకాన్ అయిన ప్రియాంక చోప్రా కనిపిస్తే.. నిజంగా సినిమా స్థాయి మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే, SSMB29 టీమ్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.