కల్కి 2 కి ముందే ఆ సీక్వెలా..?

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ తన రెండో సినిమా మహానటితో సూపర్ హిట్ అందుకున్నాడు.;

Update: 2025-03-18 13:51 GMT

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ తన రెండో సినిమా మహానటితో సూపర్ హిట్ అందుకున్నాడు. సావిత్రమ్మ జీవిత కథతో తెరకెక్కిన మహానటి సినిమా విషయంలో అతని ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక నాగ్ అశ్విన్ నెక్స్ట్ కల్కి 2898 AD అంటూ మరో సంచలనాన్ని సృష్టించాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమా మొదటి పార్ట్ ఆడియన్స్ కి ఒక సరికొత్త వరల్డ్ ని ఎక్స్ పీరియన్స్ చేసేలా చేసింది.

ఐతే కల్కి 2 కూడా చేయాల్సి ఉన్నా ప్రభాస్ డేట్స్ కాస్త కష్టమయ్యేలా ఉన్నాయి. ఐతే ప్రభాస్ తో కల్కి 2 చేసేలోగా నాగ్ అశ్విన్ మరో సీక్వెల్ ని చేసే ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగ్ అశ్విన్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ కల్కి 2 ప్రిపరేషన్స్ చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అందుకే ఈలోగా తను జాతిరత్నాలు 2 కూడా చేస్తానని అంటున్నాడు. జాతిరత్నాలు 2 ఎప్పటి నుంచో ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అనుదీప్ ప్రస్తుతం విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక జాతిరత్నాలు 2 ఉండే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరోపక్క నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాక మరోటి లైన్ లో ఉంది.

జాతిరత్నాలు సినిమా ఆడియన్స్ ని ఎంత ఎంటర్టైన్ చేసిందో తెలిసిందే. కోవిడ్ టైం లో ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఐతే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ గురించి డిస్కషన్స్ ఉన్నా ఇప్పటివరకు ఎవరు నోరి విప్పలేదు. ఐతే నిర్మాత నాగ్ అశ్విన్ జాతిరత్నాలు 2 గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. కల్కి 2 ప్రిపరేషన్ చాలా ఉంది కాబట్టి ఈలోగా జాతిరత్నాలు 2 చేస్తా అంటున్నాడు.

జాతిరత్నాలు సినిమా జోగిపేట బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇక సీక్వెల్ కథ అమెరికా షిఫ్ట్ అవుతుందని తెలుస్తుంది. ముగ్గురు కుర్రాళ్ల కథగా జాతిరత్నాలు సూపర్ ఎంటర్టైన్ చేయగా ఈ సీక్వెల్ నెక్స్ట్ లెవెల్ లో జోరు కొనసాగించాలని చూస్తున్నారు. నాగ్ అశ్విన్ ప్లానింగ్ ప్రకారం చూస్తుంటే జాతిరత్నాలు సీక్వెల్ కూడా టార్గెట్ ఏమాత్రం మిస్ అవ్వకూడదనేలా ప్లాన్ చేసేలా ఉన్నారు.

Tags:    

Similar News