యంగ్ హీరో నితిన్ ఇటీవలే చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పర్చింది. ఇదే సమయంలో రంగ్ దే సినిమా ను కూడా విడుదల చేసిన నితిన్ మరో సినిమాను సిద్దం చేశాడు. బాలీవుడ్ హిట్ మూవీ అంధాధున్ ను నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. మాస్ట్రో టైటిల్ తో రాబోతున్న ఈ రీమేక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం చేస్తున్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.
మాస్ట్రో షూటింగ్ వారం నుండి పది రోజులు బ్యాలన్స్ ఉందట. కరోనా సెకండ్ వేవ్ వచ్చి ఉండకుంటే మాస్ట్రో సినిమా షూటింగ్ పూర్తి అయ్యేది. సినిమాను జూన్ లో విడుదల చేయాలని భావించినా కూడా కరోనా కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. జూన్ లో థియేటర్లు ఓపెన్ అయ్యేనో లేదో తెలియదు. ఒక వేళ థియేటర్లు ఓపెన్ అయినా కూడా ప్రేక్షకులు వచ్చేది నమ్మకం తక్కువ. కనుక మాస్ట్రో సినిమా ను జూన్ లో విడుదల చేయకపోవచ్చు అంటున్నారు.
గత ఏడాది భీష్మ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఈ ఏడాది చెక్ మరియు రంగ్ దే సినిమాలతో వచ్చాడు. మాస్ట్రో సినిమాను కూడా రెండు మూడు నెలల్లోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే మరో సినిమాను కూడా నితిన్ విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా ఈ కరోనా టైమ్ లో కూడా నితిన్ ఏకంగా మూడు సినిమాలు చేయడం రికార్డుగా చెబుతున్నారు.