కొంచెం కష్టంగానే ఉంది

Update: 2018-01-03 00:30 GMT
ప్రస్తుతం సౌత్ ఇండియన్ లో ఉన్న నటీమణుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటి నిత్యా మీనన్. అమ్మడు కెరీర్ మొదటి నుంచి చాలా వినూత్న కథలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. కథలో తన పాత్ర చిన్నది అయినా సరే డిఫెరెంట్ గా ఉంటేనే ఒకే చేస్తోంది. దీంతో చాలా మంది దర్శకులు ఈ హీరోయిన్ ను స్పెషల్ క్యారెక్టర్స్ కి తీసుకుంటున్నారు. స్టార్ హీరోలతో దర్శకులతో ఇప్పటివరకు నిత్యా చాలా సినిమాలనే చేసింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా కూడా ప్రయోగాత్మకమైన కొన్ని కథలకు నిత్యానే బెస్ట్ అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఈ మలయాళీ సుందరి ప్రాణ అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా తెలుగు తమిళ్ తో పాటు హిందీ మలయాళీ భాషలో కూడా తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్.ప్రకాష్ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మొదటి సారి ఒక కొత్త తరహా సౌండ్ సిస్టమ్ ని వాడుతున్నారట. అందుకోసం సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి చాలా కష్టపడుతున్నారని తెలుస్తోంది.

సినిమా గురించి నిత్యా మాట్లాడుతూ... మొదటి సారి ఒక కొత్త తరహా సినిమాను చేస్తున్నా. రోజు రెండు భాషల్లోని ఒకే సీన్స్ చేస్తున్నా. అది కొంచెం కష్టంగానే ఉంది. కానీ కష్టపడితేనే మంచి అవుట్ ఫుట్ వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ చుట్టూ ఈ కథ ఉంటుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళుతుంది. ఇందులో నా పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది అని చెబుతూ.. సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని నిత్యా వివరించింది.

Tags:    

Similar News