చైల్ట్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమై.. ఆ తర్వాత కథానాయికగా మారి పెద్ద రేంజికి వెళ్లిన హీరోయిన్ల లిస్టు తీస్తే శ్రీదేవి.. రాశి లాంటి వాళ్లు కనిపిస్తారు. ఈ జాబితాలోకే చేరే ప్రయత్నంలో ఉంది నిత్యా శెట్టి. అప్పట్లో ‘దేవుళ్లు’ అనే హిట్ మూవీలో ముఖ్య పాత్ర పోషించిన బాల నటి గుర్తుండే ఉంటుంది. ఆ అమ్మాయి పేరు నిత్యా శెట్టి. బాల నటిగా ‘దేవళ్లు’తో పాటు ఇంకొన్ని సినిమాల్లో కనిపించిన నిత్య.. ఈ మధ్యే హీరోయిన్ అయింది. ఉషా కిరణ్ మూవీస్ వాళ్ల ‘దాగుడు మూతల దండాకోర్’ సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. ఆ తర్వాత నాగార్జున ప్రమోట్ చేసిన ‘పడేసావె’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా కనిపించింది నిత్య.
ఈ రెండు సినిమాలూ ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా.. నిత్యకు మాత్రం పేరొచ్చింది. తన క్యూట్ నెస్ తో.. నటనతో ఆకట్టుకుంది నిత్య. తెలుగులో ఆమెకు ఒకట్రెండు అవకాశాలు చేతిలో ఉన్నాయి. వాటితో పాటు తమిళంలోనూ అవకాశాలు అందుకుంటోంది నిత్య. ఒకేసారి ఆమెకు రెండు మూడు అవకాశాలు లభించాయి. వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్న నిత్య.. అక్కడ హీరోయిన్ గా నిలదొక్కుకుంటానని ఆశతో ఉంది. తమిళంలోకి వెళ్లిన చాలామంది తెలుగు హీరోయిన్లు అక్కడ మంచి పేరు సంపాదించారు. నిత్య కూడా అదే జాబితాలో చేరుతుందేమో చూడాలి. స్వతహాగా తెలుగమ్మాయే అయినా.. నిత్య పెరిగింది బెంగళూరులో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/