ఒకే ఏడాదిలో 5 రిలీజ్లు అంటే మాటలా? కానీ ఈ అమ్మడు నటించిన ఐదు సినిమాలు ఈ ఏడాదిలో రిలీజవుతున్నాయి. కెరీర్ ప్రారంభించి ఇప్పటికే జెట్‌స్పీడ్ అందుకున్నా.. స్టార్ హీరోయిన్ స్టాటస్ మాత్రం అందుకోలేకపోతోంది నిత్యామీనన్. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే లాంటి ఘనవిజయాలు దక్కినా స్టాటస్‌లో మాత్రం మార్పేమీ లేదు.
ఇక ఈఏడాది వరుస రిలీజ్‌లతో తన రేంజు మారిపోతుందనే నిత్యా భావిస్తోంది. ఇటీవలే రిలీజైన ప్రేమకథా చిత్రమ్ 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' నిత్యాకి చాలా చక్కని పేరు తెచ్చింది. ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తి రిలీజవుతోంది. ఇందులో నిత్యా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించింది. ఇదేగాక గుణశేఖరుని రుద్రమదేవి 3డిలో రాకుమారి పాత్రలో నటించింది. దాంతో పాటు దక్షిణాది స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 'ఒకే బంగారం' చిత్రంలో నటించింది. ఇవన్నీ ఈ ఏడాది వరుసగా రిలీజవుతున్నాయి.
వీటితోపాటు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంచన 2' ఏప్రియల్ 17న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇలా ఐదు రిలీజ్లు ఒకే ఏడాదిలో .. అంటే నిత్యా ఇక స్టార్ హీరోయిన్ అన్న ట్యాగ్ అందుకోవడానికి ఇంకెంతో సమయం పట్టదన్నమాట!