నిత్య.. ఏం నచ్చిందమ్మా ఇందులో?

Update: 2015-04-10 15:43 GMT
ఇక్కడేమనిపిస్తే అదే చెప్తాను.. ఇక్కడేమనిపిస్తే అదే చేస్తాను అనే నటీమణుల జాబితాలో బూరెబుగ్గల నిత్యామీనన్‌ ముందుంటుంది. దానికి తగ్గట్లే ఫ్లాపైన సినిమాల్లో నిత్య చేసిన క్యారెక్టర్లన్నీ చాలా బాగుంటాయి. అమ్మడు కూడా మాంచి పవర్‌ఫుల్‌ యాక్టింగ్‌తో అదరకొడుతుంది. బాగానే ఉంది. ఇంతకీ అమ్మడు సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమాలోని రోల్‌ ఎందుకు ఒప్పుకున్నట్లు?

ఏదో కొత్తగా తెలుగు తమిళ యాసలో డైలాగులు చెప్పడం తప్పిస్తే.. అసలు ఈ సినిమాలో ఉపేంద్ర చెల్లెలుగా నిత్యమీనన్‌ చేసిన రోల్‌ ఏమాత్రం కనెక్ట్‌ అవ్వలేదు. అసలు ఆ పాత్రను సాధారణంగా ఎవరైనా టైప్‌ 2 హీరోయిన్‌ చేయాలి కాని, నిత్య వంటి పెర్‌ఫార్మర్లు చేయాల్సినంత అవసరం లేదు. నాలుగు డైలాగులు లేవు, ఇచ్చిన పాటలో పసలేదు, క్యారెక్టర్‌ జనాలకు నచ్చనూ లేదు. ఇంతకీ ఆ పాత్రను ఎందుకు చేసిందో మరి.. ఒకవేళ కేవలం పెద్ద హీరో సరసన చేసే అవకాశం రాకరాక వచ్చింది కాబట్టి, ఇప్పుడు మిస్సయితే ఎప్పటికీ రాదు అనుకొని చేసేసిందా? బన్నీ వంటి హీరోతో సింగిల్‌ సాంగ్‌ అయినే బెటర్‌ అనుకుందా? మీనింగ్‌ఫుల్‌ పాత్రలు ఎన్నిరోజులు చేస్తాం, స్టార్‌డమ్‌ కావాలని కోరుకుంటోందా? ఏమోమరి.. ఆమెకే తెలియాలి. లేకపోతే సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి పాత్ర ఏం నచ్చి చేసినట్లు..
Tags:    

Similar News