కొద్దిమంది కథానాయకులు సినిమా చేయడానికి ఒప్పుకొన్నారంటే ఆ కథపై రాజముద్ర పడిపోయినట్టే. గన్ షాట్ గా హిట్టంతే అనే నమ్మకాన్ని పెంచేసుకొంటుంటారు ప్రేక్షకులు. ఆయా హీరోలకున్న అభిరుచి - అంతకుముందు వాళ్లు చేసిన సినిమాల్నిబట్టి ప్రేక్షకులు అలా గుడ్డిగా నమ్మకం పెంచేసుకొంటుంటారు. కథానాయికల్లోనూ కొద్దిమంది ఆ తరహా గుర్తింపును పొందినవాళ్లున్నారు. అందులో నిత్యమీనన్ ఒకరు. ఈమె స్టోరీ సెలెక్షన్ ని చూసి ప్రేక్షకులు ఎన్నిసార్లు ఫిదా అయిపోయారో లెక్కే లేదు. సినిమా హిట్టు - ఫ్లాపు అనే విషయాన్ని పక్కనపెడితే ఆమె చేసిన కథలు మాత్రం అదిరిపోతుంటాయి. ఎంతైనా నిత్య టేస్టే వేరబ్బా అంటుంటారు ప్రేక్షకులు. అలాంటి గుర్తింపును తెచ్చుకొన్న నిత్య ఒక్క అమ్మాయి తప్పలాంటి సినిమాని ఎందుకు చేసిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని, ఆమెకి అందులో ఏం నచ్చిందో, ఆమెకున్న టేస్టు ఏమైందో అని బహిరంగంగానే మాట్లాడుకొంటున్నారు సినీ ప్రేమికులు.
నిన్ననే ఒక్క అమ్మాయి తప్ప విడుదలైంది. ఆ సినిమాకే కాదు, అందులో నిత్య నటనకి కూడా మైనస్ మార్కులు పడిపోయాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే నిత్య ఓవర్ యాక్షన్ చేసిందని కూడా మాట్లాడుకొంటున్నారు. తెలుగులో నిత్య కెరీర్ మొదలైనప్పట్నుంచి ఆమె చేసిన సినిమాలకి ఇంత నెగిటివ్ ప్రచారం జరగడం ఇదే తొలిసారనేది విశ్లేషకుల మాట. అన్నట్టు నిజంగానే నిత్య టేస్టు ఈమధ్య బాగా మారిందని, అంతగా ప్రాధాన్యం లేని పాత్రల్ని కూడా అలవోకగా ఒప్పేసుకొంటోందన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచీ వ్యక్తమవుతోంది. పారితోషికం కోసమే ఆమె ఆ తరహా పాత్రల్ని ఒప్పుకొంటుందో ఏంటో మరి!