సౌత్ ఇండియాలో చాలామంది హీరోయిన్లున్నారు. కానీ వాళ్లందరి మధ్య నిత్యా మీనన్ చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. దీనికి ఆమె యాక్టింగ్ టాలెంట్ ఒక్కటే కారణం కాదు. ఆమె నాలెడ్జ్.. ఆమె మాటతీరు.. ముక్కుసూటి తనం.. సినిమాల ఎంపికలో చూపించే వైవిధ్యం.. ఇలా నిత్యను స్పెషల్ గా నిలబెట్టే చాలా అంశాలు తనలో ఉన్నాయి. ఒక పాత్రను పండించే విషయంలో నిత్య చూపించే మెచ్యూరిటీ ఆమెకు చాలామంది అభిమానుల్ని తెచ్చిపెట్టింది. నటీనటులు - దర్శకుల్లో సైతం ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మలయాళ దర్శకులు - నటీనటుల్లో ఆమెకు చాలా గౌరవం ఉంది. అంజలి మీనన్ లాంటి లేడీ డైరెక్టర్లతో ఆమెకు మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది.
ఐతే ఊరికే ఫ్రెండ్ షిప్ తో సరిపెట్టకుండా తన డైరెక్టర్ ఫ్రెండ్స్ నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటోదట నిత్య. భవిష్యత్తులో వాళ్ల లాగే తాను కూడా దర్శకురాలిగా మారడం ఖాయమని కూడా అంటోంది నిత్య. సినిమాల్లో తన యాంబిషన్ డైరెక్టర్ కావడమే అని కూడా చెప్పిందామె. ‘‘మనసులోని భావాలను దృశ్యంగా మలచడంలోని ఆనందమే వేరు. ఖాళీ సమయాల్లో కథలు రాసే అలవాటు వుంది. అలా చాలా కథలు రాశా. ఆ కథలను తెరకెక్కించాలని కోరికగా వుంది. భవిష్యత్తులో కచ్చితంగా దర్శకురాలిగా మారుతా’’ అని నొక్కి వక్కాణించింది నిత్య. నటిగా ఉన్నపుడే తన టేస్టేంటో చాటుకున్న నిత్య.. దర్శకురాలిగానూ తన ప్రత్యేకత చూపిస్తుందనడంలో సందేహం లేదు. బహుశా హీరోయిన్ గా కెరీర్ ముగిసిపోయాక మెగా ఫోన్ పట్టేస్తుందేమో రింగుజుత్తు సుందరి.