విశ్వ నటుడిగా ఎంతగానో గుర్తింపును అందుకున్న కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి విక్రమ్ సినిమా తో మాత్రం ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు. తెలుగులో కూడా కమల్ హాసన్ సక్సెస్ చూసి చాలా కాలమైంది. ఒకప్పుడు కమల్ హాసన్ సినిమా వస్తోంది అంటే తెలుగు ఆడియన్స్ కూడా ఎగబడి చూసేవారు.
కానీ ఆయన గతంలో మాదిరిగా అంచనాలకు తగ్గట్టుగా మెప్పించడం లేదు అని ప్రేక్షకుల నుంచి ఒక విమర్శ అయితే వస్తుంది. ఇక ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే విధంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కమల్ హాసన్ తెలియజేశాడు. తెలుగులో విక్రమ్ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేయాలి అనే కమలాసన్ ముందుగానే ఆలోచించారు.
ఇక ప్రత్యేకంగా ఈ సినిమా తెలుగు హక్కులను నితిన్ ఫాదర్ దక్కించుకున్న విషయం తెలిసిందే. శ్రేష్ట మూవీస్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కోసం కూడా ఆయన గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా ప్రమోషన్ ప్లానింగ్ కోసం ఇటీవల ఆయన డైరెక్ట్ గా కమల్ హాసన్ ఇంటికి కూడా వెళ్లారు. అక్కడ కొన్ని గంటల పాటు కమలాసన్ తో మాట్లాడిన సుధాకర్ రెడ్డి ప్రత్యేకంగా హైదరాబాద్ లో విక్రమ్ సినిమాను ప్రమోట్ చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా విక్రమ్ తెలుగు పోస్టర్ తో ఫొటోకి స్టిల్ ఇచ్చారు.
ఇక హైదరాబాద్ లోనే సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసినట్లుగా చెప్పడంతో కమల్ హాసన్ కూడా ఈవెంట్ కు వస్తాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
విక్రమ్ సినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమా విడుదల కాబోయే ఐదు రోజుల ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలి అని ఆలోచిస్తున్నారు. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.