కొంత మందికి ఫాస్ట్ గా స్టార్ డమ్ ని ఏలేయాలని, ఎంజాయ్ చేయాలని వుంటుంది..కానీ కొంత మందికి మాత్రం స్లో అండ్ స్టడీగా వెళదాం అంటూ సెలెక్టీవ్ పసినిమాలతో వెళుతుంటారు. అలాంటి వాళ్లలో నిలిచే హీరో సుధీర్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ అండతో సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చినా తనదైన స్టైల్ ని అనతికాలంలోనే సొంతం చేసుకున్నారు. అయితే భారీ రేంజ్ సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వడం లేదు. తనకు తగ్గ కథలతో స్లో అండ్ స్టడీ అనే ఫార్ములాతో విభిన్నమైన కథలతో ముందుకు సాగుతున్నారు. నేడు ఈ హీరో పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చేశారు.
అంతే కాకుండా అందరు స్టార్ లకు ముందు ఓ బిరుదు వున్నట్టుగానే తనకూ నిట్రోస్టార్ అనే ట్యాగ్ ని తాజాగా యాడ్ చేయడం విశేషం. సుధీర్‌బాబు 'శ్రీదేవి సోడా సెంటర్' తరువాత రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రీకరణ దశలో వుంది. ఈ మూవీతో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలోనూ నటిస్తున్నారు. నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలుగు, హిందీ భాషల్లో బై లింగ్వల్ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రానికి 'మామా మశ్చీంద్ర' అనే టైటిల్ ని ఖరారు చేశారు. అంతే కాకుండా ఈచిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని హీరో సుధీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఇదే పోస్టర్ పై సుధీర్ బాబుని నిట్రోస్టార్ అని సంబోధించడం విశేషం. ఫస్ట్ ఉలక్ పోస్టర్ లో సుధీర్ బాబు రెట్రో లుక్ లో రాక్ స్టార్ గా కనిపిస్తున్నాడు. పోస్టర్ లో సుధీర్ బాబు స్క్రీన్ ప్రజెన్స్ చాలా డైనమిక్ గా వుంది.
సినిమా టైటిల్ 'మామా మశ్చీంద్ర' సౌండింగ్ కూడా చాలా కొత్తగా వెరైటీగా వుంది. టైటిల్ కు చాలా మీనింగ్ వుంది. పవర్ కోసం ప్రయత్నించే వాడు, యాంబీషియస్, కరేజియస్ ఇలా చాలా అర్థాలున్నాయి. ఇందులో హీరో ఏ తరహాలో కనిసిస్తాడో చూడాలి. సినిమాలో హీరో సుధీర్ బాబు మల్టీషేడ్స్ వున్న ఛాలెంజింగ్ రోల్ లో కనిపించబోతున్నారట. ఫాంకీ కాస్ట్యూమ్స్ లో పంబ్ లో వున్న స్టేజ్ పై రాక్ స్టార్ గా సుధీర్ బాబు కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. సుధీర్ బాబు చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమా చేస్తున్నారట.
ఈ మూవీని హిందీలోనూ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో గ్రేట్ టెక్నీషియన్స్ ని తీసుకున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం, పీజీ విందా సినిమాటోగ్రఫీ, ఆర్ట్ రాజీవ్.. ఇలా ప్రతీ ఒక్కరిని టాప్ టెక్నీషియన్స్ ని ఈ మూవీ కోసం తీసుకున్నారు. 'బాఘీ' చిత్రంతో హిందీలోనూ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సుధీర్ బాబు ఈ సినిమాతో హీరోగా అక్కడి ప్రేక్షకులని కూడా అలరించబోతున్నారు.
సరికొత్త నేపథ్యంలో విభిన్నమైన కథగా తెరకెక్కుతున్న'మామా మశ్చీంద్ర' యాక్షన్ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. చాలా రోజుల తరువాత బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుక రాబోతున్న సుధీర్ బాబు కెరీర్ మరో టర్న్ తీసుకుంటుందో లేదో తెలియాలంటే 'మామా మశ్చీంద్ర' రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.